Bomb Threat: ప్రియుడు మీద కోపంతో భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు
ప్రియుడు మీద కోపంతో భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు
Bomb Threat : తాను ప్రేమించిన వ్యక్తి వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడన్న అక్కసుతో ఓ టెకీ ప్రతీకార చర్యలకు దిగింది. తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో అతడిని ఇరాకటంలో పెట్టేందుకు యత్నించింది. ఈ క్రమంలోనే అతడి పేరిట నకిలీ ఈ-మెయిల్ ఐడీలు, డార్క్ వెబ్, వీపీఎన్ల ద్వారా 12 రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు బాంబు బెదిరింపు సందేశాలు పంపింది. తన ఆచూకీ లభ్యం కాకుండా ఎత్తులు వేసినప్పటికీ… చివరకు సైబర్ పోలీసుల చేతికి చిక్కింది.
Bomb Threat Viral
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.జ. రెనే జోషిల్డా అనే మహిళ… చెన్నైలోని (Chennai) ఓ ప్రముఖ ఎంఎన్సీలో సీనియర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తోంది. ఓ వ్యక్తిని ఆమె వన్‌సైడ్ లవ్ చేసింది. అతడినే వివాహం చేసుకోవాలనుకుంది. అతడు వేరే మహిళను పెళ్లి చేసుకోవడంతో… తట్టుకోలేకపోయింది. అతడి ప్రతిష్ఠను దిగజార్చాలనుకుంది. ఈ క్రమంలోనే నకిలీ ఈ-మెయిల్ ఐడీలు, డార్క్ వెబ్, వీపీఎన్ల ద్వారా గుజరాత్, తెలంగాణ, రాజస్థాన్, పంజాబ్, తమిళనాడు తదితర 12 రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు బాంబు బెదిరింపు సందేశాలు పంపింది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం, బీజే వైద్యకళాశాల, రెండు పాఠశాలలూ ఈ జాబితాలో ఉన్నాయి. ఓ పాఠశాల యాజమాన్యం ఈ వ్యవహారంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే సైబర్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇతర రాష్ట్రాల పోలీసులతోనూ సమన్వయం చేసుకున్నారు. తన గుర్తింపు, లోకేషన్ బయటపడకుండా ఆమె తెలివిగా వ్యవహరించిందని, కానీ.. చిన్న తప్పిదంతో దొరికిపోయిందని పోలీసులు తెలిపారు. చెన్నైలోని నివాసంలో ఆమెను అరెస్టు చేసినట్లు చెప్పారు.
Also Read : Minister Vangalapudi Anitha: జగన్ కు రాజకీయ లబ్ధి తప్ప మనుషుల ప్రాణాలంటే లెక్క లేదు – అనిత
