Rabies: రేబిస్ భయంతో మూడేళ్ల కుమార్తెను చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ
రేబిస్ భయంతో మూడేళ్ల కుమార్తెను చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ
Rabies : తమ కుటుంబ సభ్యులకు రేబిస్ వ్యాధి సోకిందన్న అనుమానంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై, తన మూడేళ్ల కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారకర ఘటన మహబూబ్ నగర్ జిల్లా మొనప్పగుట్టలో చోటు చేసుకుంది. తమ ఆత్మహత్యకు ముందు తాను పడుతున్న మనోవేధనను, చివరి కోరికను ఇంట్లో బ్లాక్ బోర్డుపై రాసింది. దీనితో తల్లీకూతుళ్ళ ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Woman Suicide for Rabies
మహబూబ్ నగర్ జిల్లా మొనప్పగుట్టలో యశోద అనే మహిళ… గత జూన్ నెలలో తన ఇంటి ఆవరణలో పల్లీలు,డ్రై ఫ్రూట్స్ ఆరబెట్టింది. అవే పల్లీలు,డ్రై ఫ్రూట్స్‌ను వంటకాల్లో వాడింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరికీ అనారోగ్య సమస్యలు తలెత్తాయి. కుటుంబ సభ్యులకు రేబిస్ (Rabies) సోకిందని అనుమానం పెట్టుకుంది. ఆ అనుమానంతోనే ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ యాంటీ రేబిస్ ఇంజక్షన్ చేయించింది. నాటు వైద్యం చేయించుకునేలా బలవంతం చేసింది. కుటుంబ సభ్యులందరికీ రేబిస్ (Rabies) సోకిందని మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో తన మూడేళ్ల కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది.
ఘటన జరిగిన సమయంలో ఆఫీస్ కు వెళ్ళిన యశోద భర్త… ఇంటికి ఫోన్ చేశాడు. అమ్మ బెడ్రూంలోకి వెళ్లి డోర్ తీయడం లేదని తన కుమారుడు చెప్పాడు. దీనితో భయపడిపోయిన నరేష్ పక్కింటి వారికి ఫోన్ చేసి అప్రమత్తం చేశాడు. దీనితో పక్కింటి వారు బెడ్రూం రూమ్ బలవంతంగా ఓపెన్ చేసి చూడగా… తల్లి,కుమార్తె విగతజీవులుగా కనిపించారు. కాగా, భర్త, కొడుకు మందులు వాడుతూ జాగ్రత్తగా ఉండాలని ఆత్మహత్య చేసుకునే ముందు యశోద గోడపై రాయడం గమనార్హం. యశోద తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నా భర్తను కాపాడండి.. రేబిస్ ఉంది. వ్యాక్సిన్‌కు తగ్గదు. చెట్టు మందు తినిపించండి. మీరు చేయించండి. లక్కీని ఆస్పత్రిలో చూపించు వాడికి రేబిస్ ఉంది. నా చివరి కోరి ధారూర్(వికారాబాద్)లో చెట్టు మందు తాగు.. లేట్ చేయకు.. అంటూ గోడపై రాసింది. దీనిబట్టి బాధితురాలు తన చివరి క్షణాల్లో కుటుంబం గురించి ఎంత ఆలోచించి తనువు చాలించిందో అర్థమౌతోంది. రేబిస్ వ్యాధి సోకిందన్న అనుమానంతో యశోద తీవ్ర మానసిక ఒత్తిడికి గురై, తన మూడేళ్ల కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తోంది.
Also Read : Election Commission: స్థానిక సంస్థల ఎన్నికల తుది ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ విడుదల
