Rakesh Tikait : రెజ్లర్లు ఈ దేశ బిడ్డలు కారా – టికాయత్
కేంద్రంపై నిప్పులు చెరిగిన రైతు నేత
Rakesh Tikait : సంయుక్త కిసాన్ మోర్చా అగ్ర నేత రాకేశ్ టికాయత్(Rakesh Tikait) నిప్పులు చెరిగారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమపై వేధింపులకు పాల్పడుతున్నాడని, వెంటనే చీఫ్ గా తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో మహిళా రెజ్లర్లు ఆందోళన చేపట్టారు. వీరికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి రైతు సంఘాలు. ఈ సందర్భంగా భారీ ఎత్తున రైతులు ఢిల్లీకి చేరుకుంటున్నారు.
మహిళా రెజ్లర్లకు న్యాయం జరిగేంత దాకా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు రైతు నేత రాకేశ్ టికాయత్. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా మల్ల యోధులు ఈ దేశానికి చెందిన ఆడబిడ్డలు కారా అని ప్రశ్నించారు. బేటీ బచావో బేటీ పడావో అంటూ ప్రచారం చేసుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళా రెజ్లర్లు చేస్తున్న ఆందోళన కనిపించడం లేదా అని నిలదీశారు రాకేశ్ టికాయత్.
ఎందుకు చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. కేంద్ర సర్కార్ ఎందుకు వివక్ష ను చూపుతోందని, ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 30 మందికి పైగా మల్ల యోధులు రోడ్డుపైకి వచ్చారని ఎంత బాధకు గురైతే వాళ్లు నిరసన చేపడతారో ఆలోచించాలన్నారు. ఈ దేశంలో క్రీడా శాఖ మంత్రి అనే వ్యక్తి ఉన్నాడా అని మండిపడ్డారు రాకేశ్ టికాయత్(Rakesh Tikait).
Also Read : రైతుల మద్దతుపై బ్రిజ్ భూషణ్ గుస్సా