Face Book : ఫేస్ బుక్ భద్రత పట్ల మహిళల ఆందోళన
అంతర్గత నివేదికలో వెల్లడైన నిజం
Face Book : ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో టాప్ లో ఉన్న ఫేస్ బుక్ పట్ల మహిళలు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని సదరు సంస్థ నిర్వహించిన అంతర్గత నివేదికలో వెల్లడైంది.
అపరిచిత వ్యక్తులతో పరిచయం, డాటా మార్పిడి, ఇతర కారణాలు కూడా ప్రధాన కారణం. వరల్డ్ వైడ్ గా చూస్తే భారత దేశంలోనే ఎక్కువగా ఫేస్ బుక్ ను వినియోగిస్తున్నారు.
టాప్ మోస్ట్ సోషల్ మీడియా సంస్థలన్నింటికి ఇండియన్స్ ఒక వేదికగా మారారు. ఇది విచిత్రమైన అంశమేమీ కాదు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న
రోజూ వారీ వినియోగదారులలో ఫేస్ బుక్ మొట్ట మొదటి త్రైమాసిక తగ్గుదలని మెటా ప్లాట్ ఫారమ్ లు నివదించాయి.
ఫేస్ బుక్ ను మెటా గా మార్చేశారు. అధిక మొబైల్ డేటా ఖర్చులను అతి పెద్ద మార్కెట్ అయిన భారత దేశంలో వృద్దిని మంద గించేందుకు ప్రత్యేకమైన అడ్డంకిగా గుర్తించారు.
అదే రోజు యుఎస్ టెక్ గ్రూప్ భారత దేశంలోని ఫేస్ బుక్(Face Book) వ్యాపారంపై తన స్వంత పరిశోధన ఫలితాలను అంతర్గత ఉద్యోగుల
ఫోరమ్ లో పోస్ట్ చేసింది కూడా. 2021 చివరి వరకు రెండేళ్ల పాటు నిర్వహించిన అధ్యయనంలో పలు సమస్యలను గుర్తించింది.
ఇందులో ప్రధానంగా చాలా మంది మహిళలు తమ భద్రత , గోప్యత గురించి ఆందోళన చెందుతున్నారు. దీంతో పురుషుల ఆధిపత్య సోషల్ నెట్
వర్క్ కి దూరంగా ఉన్నారు.
కంటెంట్ భద్రత, అవాంఛిత పరిచయాల గురించిన ఆందోళనలు మహిళల ఫేస్ బుక్ వినియోగానికి ఆటంకం కలిగిస్తాయని పేర్కొంది.
మహిళలను వదిలి పెట్టి మెటా భారత దేశంలో విజయం సాధించదని స్పష్టం చేసింది.
నగ్నత్వం , యాప్ రూప కల్పనలలో సంక్లిష్టత , స్థానిక భాష, అక్షరాస్యత లోపాలు , వీడియో కంటెంట్ ను కోరుకుకునేలా అప్పీల్ లేక పోవడం కూడా కారణమని తెలిపింది.
Also Read : బిల్ గేట్స్ ను అధిగమించిన అదానీ