Wriddhiman Saha : వృద్ది మాన్ సాహా సాహోరే

స‌త్తా చాటినా త‌ప్ప‌ని ఓట‌మి

Wriddhiman Saha : ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ ముగిసింది. ధోనీ సార‌థ్యం లోని చెన్నై సూప‌ర్ కింగ్స్ విజేత‌గా నిలిచింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో 5 సార్లు ఛాంపియ‌న్ గా నిలిచి రికార్డు సృష్టించింది. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ముందుగా బ్యాటింగ్ కు దిగింది గుజ‌రాత్ టైటాన్స్(GT). నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 4 వికెట్లు కోల్పోయి 214 ప‌రుగులు చేసింది. ఎప్ప‌టి లాగే దూకుడుతో దుమ్ము రేపాడు శుభ్ మ‌న్ గిల్. 20 బంతులు ఎదుర్కొని 7 ఫోర్ల‌తో 39 ర‌న్స్ చేశాడు. ధోనీ అద్భుత‌మైన స్టింపింగ్ తో వెనుదిరిగాడు.

గ‌త కొన్ని మ్యాచ్ ల‌లో నిరాశ ప‌రిచిన వికెట్ కీప‌ర్ వృద్ది మాన్ సాహా(Wriddhiman Saha) మాత్రం ఫైన‌ల్ మ్యాచ్ లో త‌న‌దైన శైలిలో ఆక‌ట్టుకున్నాడు. బాధ్య‌తాయుత‌మైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. ఓ వైపు స‌హ‌చ‌రుడు గిల్ వెనుదిరిగినా ఎక్క‌డా ఆగ‌లేదు. 39 బంతులు ఎదుర్కొని 54 ర‌న్స్ చేశాడు. ఇందులో 5 ఫోర్లు ఓ భారీ సిక్స‌ర్ ఉంది.

అనంత‌రం మ్యాచ్ కు వ‌ర్షం ఆటంకం క‌లిగించింది. అర్ధ‌రాత్రి 12.10 గంట‌ల స‌మ‌యంలో సీఎస్కే ముందు 15 ఓవ‌ర్ల‌లో 171 ర‌న్స్ ల‌క్ష్యాన్ని నిర్ణ‌యించారు అంపైర్లు. ఆరంభం నుంచే 15 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 171 ర‌న్స్ చేసింది. కాన్వే 25 బంతులు ఎదుర్కొని 47 ర‌న్స్ చేశాడు. 4 ఫోర్లు 2 సిక్స‌ర్లు ఉన్నాయి. ఇక శివ‌మ్ దూబే 21 బంతులు ఎదుర్కొని 32 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.

గైక్వాడ్ 3 ఫోర్లు ఒక సిక్స‌ర్ తో 26 ర‌న్స్ చేశాడు. అజింక్యా ర‌హానే 13 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 27 ర‌న్స్ చేశాడు. అంబ‌టి రాయుడు ఒక ఫోర్ 2 సిక్స‌ర్ల‌తో 19 ప‌రుగులు చేస్తే ర‌వీంద్ర జ‌డేజా ఒక ఫోర్ ఒక సిక్స‌ర్ తో 15 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.

Also Read : Sai Sudarshan

 

Leave A Reply

Your Email Id will not be published!