Oscar Nominations : భారత్ కు ఇది ఊహించిన షాక్ అని చెప్పక తప్పదు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తితో ఎదురు చూసిన ఆస్కార్ నామినేషన్ల ఫైనల్ జాబితాలో కేవలం ఒకే ఒక్క మూవీ నిలిచింది.
ఇక తప్పనిసరిగా అవార్డు వస్తుందని ఆశించిన సౌత్ ఇండస్ట్రీకి చెందిన తమిళ సినిమా జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సూర్య నటించిన జై భీమ్ ఎంపిక కాలేదు.
ఇక ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన మోహన్ లాల్ నటించిన మరాక్కమ్ ఊహించని రీతిలో తిరస్కరణకు గురి కావడం భారతీయ సినీ అభిమానులను నిరాశకు గురి చేసింది.
ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ అందరి ఆశలపై నీళ్లు చల్లింది ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్. ఇక ప్రకటించిన నామినేషన్స్ లో ద పవర్ ఆఫ్ ది డాగ్ మూవీకి 12 నామినేషన్లు దక్కడం విశేషం.
డ్యూన్ చిత్రం 10, వెస్ట్ సైడ్ స్టోరీ , బెల్ ఫాస్ట్ మూవీస్ కు సంబంధించి ఏడేసి చొప్పున నామినేషన్లు దక్కాయి. ఉత్తమ చిత్రం పురస్కారం కసోం 10 సినిమాలు పోటీ పడుతున్నాయి.
మార్చి 27న ఫైనల్ గా ఎవరు విజేతలు అన్నది ప్రకటిస్తారు. ఇక భారతదేశం నుంచి ఒకే ఒక్క మూవీ ఎంపిక కావడం గమనార్హం. ఢిల్లీకి చెందిన ఫిల్మ్ మేకర్స్ రిటు థామస్ , సుష్మిత్ ఘోష్ తీసిన రైటింగ్ విత్ ఫైర్ (Oscar Nominations)ఆస్కార్ నామినేషన్ కు ఎంపికైంది.
ఈ చిత్రానికి ఇంటర్నేషనల్ స్థాయిలో పలు అవార్డులు లభించాయి.
Also Read : 14న ‘సర్కారు వారి పాట’ అప్ డేట్