XI Jin Ping : ఎట్టకేలకు బయటకు వచ్చిన జిన్ పింగ్
సైనిక తిరుగుబాటు ప్రచారం నిజమేనా
XI Jin Ping : ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలలో టాప్ లోకి దూసుకు పోతున్న చైనాలో ఏం జరుగుతోందన్న ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా అమెరికా నిత్యం డ్రాగన్ దేశంపై కన్నేసి ఉంచింది. తనను ప్రతిదానిలో సవాల్ చేస్తూ వస్తోంది చైనా. దీనిని జీర్ణించు కోలేక పోతోంది. చైనాకు అడుగడుగునా అడ్డు పడుతోంది.
ఇదే సమయంలో చైనా కూడా తక్కువ తినలేదు. వీలైతే అమెరికాతో యుద్దానికి సై అంటోంది. ఉక్రెయిన్ పై జరుగుతున్న యుద్దంలో రష్యా వైపు చైనా నిలిచింది. ఉక్రెయిన్ కు యూరోపియన్ దేశాలతో పాటు అమెరికా బేషరతు మద్దతు ప్రకటించాయి. ఈ క్రమంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చైనా అధ్యక్షుడిగా ఉన్న జిన్ పింగ్ ను నిర్బంధించిందన్న ప్రచారం జోరందుకుంది.
ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేశాయి. దీంతో ఆయనను తొలగించారని ఆర్మీ చీఫ్ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారంటూ వార్తలు పెద్ద ఎత్తున ప్రచురితం అయ్యాయి. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ చైనా చీఫ్ జిన్ పింగ్(XI Jin Ping) బయటకు వచ్చారు. చాలా హుందాగా ఎప్పటి లాగే నవ్వుతూ కనిపించడంతో అవన్నీ పుకార్లేనని తేలి పోయింది.
అయితే వచ్చే నెల అక్టోబర్ 16న చైనా కమ్యూనిస్టు పార్టీ జాతీయ సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను జిన్ పింగ్ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. ఏది ఏమైనా జిన్ పింగ్ చీఫ్ గా ఉంటారా లేక తొలగిస్తారా అన్నది తేలాల్సి ఉంది.
Also Read : భారత్ కు వెళ్లే ముందు జాగ్రత్త – కెనడా