XI Jin Ping Step Down : ‘జిన్ పింగ్’ ఇంకానా ఇకపై చెల్లదు
మిన్నంటిన నిరసనలు..నినాదాలు
XI Jin Ping Step Down : గుప్పిట బిగించినంత వరకే ఏదైనా. ఒక్కసారి వదిలేస్తే దానిని తట్టుకోవడం కష్టం. ఉక్కు సంకల్పానికి ప్రతీకగా ఉంటూ వచ్చిన చైనాను కరోనా అట్టుడికేలా చేస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి చైనానే కారణమని అమెరికాతో పాటు పలు దేశాలు భావిస్తున్నాయి. లెక్కకు మించి ప్రాణాలు కోల్పోయారు.
గత రెండేళ్లలో యావత్ ప్రపంచం బిక్కు బిక్కుమంటూ వణికి పోయింది. బతుకు జీవుడా అంటూ ప్రస్తుతం ఊపిరి తీసుకుంటోంది. ఈ తరుణంలో చాలా దేశాలలో కరోనా తగ్గు ముఖం పట్టడం, యధావిధిగా ప్రజలు తమ రోజూ వారీ కార్యకలాపాల్లో పాలు పంచు కోవడం వస్తోంది.
అయితే చైనా మాత్రం ఇంకా కరోనాతో తల్లడిల్లుతోంది. రోజుకు 40 వేల మందికి పైగా కరోనా బారిన పడుతున్నారు. దీంతో పరిస్థితి అదుపు తప్పుతుందని గమనించిన జిన్ పింగ్ ప్రభుత్వం మరోసారి కరోనాకు సంబంధించి కఠినమైన ఆంక్షలు విధించారు. దీనిపై కోట్లాది ప్రజలు తప్పు పట్టారు.
ఆపై ఏకంగా దేశాధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన జిన్ పింగ్ పై(XI Jin Ping Step Down) నిప్పులు చెరుగుతున్నారు. వేలాదిగా జనం స్వచ్చంధంగా రోడ్లపైకి వచ్చారు. నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. వీరిని అదుపు చేసేందుకు పీపుల్స్ ఆర్మీ రంగంలోకి దిగింది. అయినా కంట్రోల్ కావడం లేదు.
తమను చంపినా సరే కానీ కరోనా పేరుతో ఇబ్బందులకు గురి చేయడాన్ని తాము ఒప్పుకోమంటూ హెచ్చరించారు. మరో వైపు షాంఘై నగరం కూడా అట్డుడుకుతోంది. ప్రస్తుతానికి చైనాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తీవ్రంగా ఉన్నా..వాటిని ప్రపంచానికి తెలియ చేయనీయకుండా సర్కార్ జాగ్రత్త పడుతోంది.
Also Read : చైనాలో గందరగోళం ‘కరోనా’పై జనాగ్రహం