CM Bommai : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన హిజాబ్ వివాదంపై సంచలన తీర్పు వెలువరించింది కర్ణాటక హైకోర్టు. 200 పేజీల తీర్పును ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ప్రకటించింది.
ఈ తీర్పు దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హోళీ తర్వాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.
ఇదిలా ఉండగా తీర్పు వెలువడిన అనంతరం జస్టిస్ అవస్థితో పాటు ఇతర న్యాయమూర్తులకు బెదిరింపులు వచ్చాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
ఈ మేరకు ఆదివారం కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై(CM Bommai )సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులకు వై కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ నిర్ణయం తక్షణమే అమలవుతుందని ప్రకటించారు. బెదిరింపుల కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు ఇప్పటికే పోలీసులు. దీంతో ముగ్గురు జడ్జీలకు భద్రత కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు సీఎం.
బెదిరింపులకు సంబంధించిన ఘటనపై సమగ్ర విచారణ జరుపాలని ఉన్నతాధికారులను బొమ్మై (ఆదేశించారు. ఈనెల ఈ సంచలన తీర్పు 15న వెలువరించింది.
ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని పేర్కొంది. ఇస్లాం మతంలో లేదని కుండ బద్దలు కొట్టింది.
కుల, మతాలు అన్నవి విద్యా సంస్థలలో ఉండవని స్పష్టం చేసింది. ఏ మతం వారైనా లేదా ఏ కులం వారైనా ప్రభుత్వం ఆదేశించిన రూల్స్ కు అనుగుణంగా చదువు కోవాలని పేర్కొంది.
Also Read : మంత్రులకు భగవంత్ మాన్ టార్గెట్