Yadadri KCR : నభూతో నభవిష్యత్ అన్న రీతిలో పునర్ నిర్మించిన యాదాద్రి (యాదగిరిగుట్ట) శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామి ఆలయ దర్శనం భక్తులందరికీ ఈనెల 28 నుంచి కలుగనుంది.
ఈ మేరకు ముహూర్తం ఖరారు చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా దీనిని తీర్చిదిద్దారు. ప్రముఖ ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణలో యాదాద్రి అంగరంగ వైభవంగా రూపుదిద్దుకుంది.
ఇందులో భాగంగా ఈనెల 21న సంప్రోక్షణ స్నపన, మృత్సంగ్రహణం, అంకురారోపణంతో ప్రారంభం అవుతుంది. 28న మహాకుంభ సంప్రోక్షణతో ప్రధాన ఆలయం పునః ప్రారంభం కానుంది.
అపర భక్తుడు, అపర భగీరథుడు, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన మహా నాయకుడిగా పేరొందిన సీఎం కేసీఆర్ (Yadadri KCR)చిరకాల స్వప్నం యాదాద్రి.
ఈ ఆలయాన్ని తిరుమలకు ధీటుగా ఉండేలా చేయాలని ఆయన సంకల్పించారు. ఆ దిశగానే ఆలయం పునర్ వైభవాన్ని సంతరించుకుంది. ప్రస్తుతం దేదీప్యమానంగా వెలుగుతోంది.
తెలంగాణలో పేరొందిన పుణ్యక్షేత్రంగా ఆ లక్ష్మీ నరసింహుడు కొలువై ఉన్నాడు. లక్షలాది మందికి ఆరాధ్య దైవంగా మారింది ఈ ఆలయం.
ఇదిలా ఉండగా పంచకుండాత్మక మహా యాగంతో సంప్రోక్షణ చేపట్టనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు నల్లన్ థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు వెల్లడించారు.
మహా కుంభ సంప్రోక్షణలో భాగంగా ప్రతి రోజూ యాగశాలలో మూలమంత్ర, మూర్తి మంత్ర జపాలు జరుగుతాయని తెలిపారు.
28న ఉదయం 11.55 గంటలకు మిథునలగ్న సుమూహూర్తాన యాదాద్రి దేవాలయాన్ని భక్తులకు, ప్రజలకు సీఎం కేసీఆర్ పునరంకితం చేస్తారని సమాచారం. కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది ఆలయ కమిటీ, ఈఓ.
Also Read : చిన్నజీయర్ పై సీతక్క సీరియస్