Yadadri Utsavam : భక్తుల పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామి బ్రహ్మోత్సవాలు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
స్వామి వారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ స్వామి వారికి గరుడ వాహన సేవ, స్వర్ణ రథోత్సవాన్ని వైభవంగా చేపట్టారు. ఉత్సవ మూర్తులైన స్వామి, అమ్మ వార్లను ప్రత్యేకంగా అలంకరించారు.
స్వామి వారు శ్రీ మహా విష్ణువు రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సమయంలో స్వామి వారిని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. తెలంగాణ తిరుపతిగా యాదాద్రి పుణ్య క్షేత్రం(Yadadri Utsavam )వినుతికెక్కింది.
అంతకు ముందు స్వామి వారు గరుడ వాహనంపై ఊరేగారు. ఆలయంలో స్వామి దివ్య విమాన రథోత్సవం కన్నుల పండువగా సాగింది. స్వామి ఉత్సవ మూర్తులు బంగారు రథంపై దర్శనం ఇచ్చారు భక్తులకు.
ఓ వైపు గోవిందా అంటూ ఇంకో వైపు లక్ష్మీ నరసింహా అంటూ నామాలతో యాదాద్రి ప్రాంగణమంతా దద్దరిల్లింది. ఎటు చూసినా స్వామి ప్రాభవమే కనిపించింది..అగుపించింది.
రథోత్సవ వేడుకలను ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు జరిపించి ప్రారంభించడం విశేషం. యాదాద్రి ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈఓ గీత పాల్గొన్నారు.
ఇవాళ ఉదయం ఆలయంలో మహా పూర్ణాహుతి నిర్వహించారు. చక్ర తీర్థ మహోత్సవం ఘనంగా చేపట్టారు. రాత్రికి స్వామి, అమ్మ వార్లకు పుష్ప యాగం, దోపు ఉత్సవం కొనసాగుతుందని ఆలయ ధర్మకర్త వెల్లడించారు.
Also Read : కోట్లల్లో ఆదాయం సౌకర్యాలు శూన్యం