Yadagirigutta brahmotsavam : 21 నుంచి యాద‌గిరిగుట్ట ఉత్స‌వాలు

ల‌క్ష్మీ న‌ర‌సింహుడి కోసం భ‌క్త‌జ‌నం

Yadagirigutta brahmotsavam : ల‌క్ష్మీ న‌ర‌సింహ్మ స్వామి కొలువైన యాద‌గిరిగుట్ట పుణ్య క్షేత్రం బ్ర‌హ్మోత్స‌వాల‌కు సిద్ద‌మైంది. ఫిబ్ర‌వ‌రి 21 నుంచి మార్చి 3 వ‌ర‌కు ఈ ఉత్స‌వాలు కొన‌సాగ‌నున్నాయి. ఒకేసారి 10 వేల మందికి పైగా భ‌క్తులు కూర్చ‌ని వీక్షించే సౌక‌ర్యాన్ని ఏర్పాటు చేసింది ఆల‌య క‌మిటీ. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. భ‌క్తులు, అర్చ‌కులు, దాత‌లు, మీడియా కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని ప్ర‌తి రోజూ స్వామి వారికి నిర్వ‌హించే సుద‌ర్శ‌న న‌ర‌సింహ హొమం, నిత్య క‌ళ్యాణం ర‌ద్దు చేశారు.

బ్ర‌హ్మోత్స‌వాల‌లో(Yadagirigutta brahmotsavam) భాగంగా ఫిబ్ర‌వ‌రి 21న ఉద‌యం 10 గంట‌ల‌కు విశ్వ‌క్సేన ఆరాధ‌న‌, స్వ‌స్తి వాచ‌నం, ర‌క్షా బంధ‌నం నిర్వ‌హిస్తారు. సాయంత్రం అంకురారోహ‌న చేప‌డ‌తారు. 22న అగ్ని ప్ర‌తిష్ట‌, ధ్వ‌జారోహ‌ణ‌, భేరీ పూజ‌, దేవ‌త ఆహ్వానం, హ‌వ‌నం కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయి.

23న వాహ‌న సేవ‌లు స్వామి వారికి నిర్వ‌హిస్తారు. ఇదే రోజు మ‌త్స్యావ‌తార అలంకార సేవ‌, వేద పారాయ‌ణం, శేష వాహ‌న సేవ ఉంటుంది. 24న వ‌ట‌ప‌త్రశాయి అలంకార సేవ‌, హంస వాహ‌న సేవ , 25న శ్రీ‌కృష్ణాలంక‌ర‌ణ సేవ‌, పొన్న వాహ‌న సేవ‌పై స్వామి వారిని ఊరేగిస్తారు.

25న శ్రీ‌కృష్ణాలంక‌ర‌ణ సేవ‌, పొన్న వాహ‌న సేన‌పై స్వామి భ‌క్తుల‌ను అనుగ‌హ్రిస్తారు. 26న గోవ‌ర్ద‌న గిరి ధారి అలంకార సేవ‌, రాత్రి సింహ వాహ‌న సేవ ఉంటుంది. 27న జ‌గ‌న్మోహ‌ని అలంకార సేవ , అశ్వ వాహ‌న సేవ , 28న స్వామి అమ్మ వార్ల తిరు క‌ళ్యాణం జ‌రుగుతుంది.

మార్చి 1న గ‌రుడ వాహ‌న సేవ‌, దివ్య విమాన ర‌థోత్స‌వం , 2న మ‌హా పూర్ణాహుతి, చ‌క్ర తీర్థం, పుష్ప‌యాగం చేప‌డ‌తారు. 3న అష్టోత్త‌ర ఘ‌టాభిషేకం, శృంగార డోల్స‌వం చేప‌డ‌తారు. భ‌క్తుల‌కు స‌క‌ల సౌక‌ర్యాలు ఏర్పాటు చేసిన‌ట్లు యాద‌గిరిగుట్ట(Yadagirigutta brahmotsavam) ఆల‌య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి రామ‌కృష్ణా రావు వెల్ల‌డించారు.

Also Read : గోవుల‌కు వంద‌నం..ఆలింగనం

Leave A Reply

Your Email Id will not be published!