Yahoo Layoffs : ఉద్యోగులకు యాహూ బిగ్ షాక్
20 శాతానికి తొలగించేందుకు ప్లాన్
Yahoo Layoffs : ఆర్థిక మాంద్యం ప్రభావం అన్ని కంపెనీలను కోలుకోలేకుండా చేస్తోంది. ఇప్పటికే గూగుల్ , మైక్రోసాఫ్ట్ మెటా , ట్విట్టర్ , జూమ్ తో పాటు లాజిస్టిక్ కంపెనీ అమెజాన్ , తదితర కంపెనీలు 90 వేల మందికి పైగా తొలగించింది. తాజాగా మరో కోలుకోలేని షాక్ తగిలింది. ప్రముఖ సెర్చింగ్ ఇంజన్ గా పేరొందిన యాహూ సంచలన ప్రకటన చేసింది.
సంస్థలో 20 శాతానికి పైగా ఉద్యోగులను అన్ని విభాగాలలో తొలగించనున్నట్లు(Yahoo Layoffs) ప్రకటించారు. ఈ విషయాన్ని సిఇఓ జిమ్ లాన్జోన్ వెల్లడించారు. ప్రస్తుతానికి శుక్రవారం 20 శాతం మంది వర్క్ ఫోర్స్ 1,600 మంది ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొన్నారు. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు.
కంపెనీకి సంబంధించిన యాడ్ టెక్ వ్యాపారంలో సగం మందిపై ప్రభావం చూపుతుంది. సంస్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇది కావాలని తీసుకున్న నిర్ణయం కాదన్నారు. వచ్చే ఆరు నెలలో మరో 8 శాతం మంది అంటే మరో 600 మందిని ఇంటికి పంపిస్తామని చెప్పారు యాహూ సిఇఓ.
రాబోయే రోజుల్లో 50 శాతానికి పైగా ఉండబోతోందని స్పష్టం చేశారు. యాహూ దాని ఎస్ఎస్పీ లేదా సప్లై సైడ్ ప్లాట్ ఫారమ్ అని పిలువబడే దాని ప్రకటనల వ్యాపారంలో కొంత భాగాన్ని మూసి వేస్తుందన్నారు. ఇది డిజిటల్ ప్రచురణకర్తలు వారి కంటెంట్ కు వ్యతిరేకంగా ఆటోమేటెడ్ ప్రకటనలను విక్రయించడంలో సహాయ పడుతుందని సిఇఓ స్పష్టం చేశారు.
ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితుల మధ్య వేలాది మంది ఉద్యోగులను తొలగించిన టెక్ కంపెనీల జాబితాలో యాహూ చేరింది.
Also Read : మస్క్ షాక్ బ్లూ టిక్ కు ఫీజు