KGF-2 Movie : రూ. 833 కోట్లు కొల్ల‌గొట్టిన కేజీఎఫ్‌-2

అత్య‌ధిక వ‌సూళ్లు చేసిన ఆరో మూవీ

KGF-2 Movie : క్రియేటివ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రాఖీ భాయ్ న‌టించిన కేజీఎఫ్ -2 మూవీ (KGF-2 Movie)రికార్డులు తిర‌గ రాస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కింది. ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రం వ‌సూళ్లు కొల్ల‌గొడుతోంది.

బాక్సాఫీస్ డే 11 రోజు వ‌ర‌కు ఏకంగా రూ. 833 కోట్లు కొల్ల‌గొట్టింది. భార‌తీయ చిత్రాల జాబితాలో మ‌రో మెట్టు ఎక్కింది. య‌శ్ తో పాటు శ్రీ‌నిధి, సంజ‌య్ ద‌త్ , ర‌వీనా టాండ‌న్ న‌టించారు ఈ మూవీలో. ఆల్ టైమ్ లో అత్య‌ధిక వ‌సూలు చేసిన చిత్రంగా నిలిచింది.

విచిత్రం ఏమిటంటే ఆదివారం ఈ చిత్రం దాని ఆదాయానికి రూ. 64.83 కోట్లు వ‌చ్చింది. దీంతో రెండో వారంలో కోట్లు కొల్ల‌గొట్టింది.

ఈ ప్ర‌క్రియ‌లో య‌శ్ న‌టించిన చిత్రం అమీర్ ఖాన్ బ్లాక్ బ‌స్ట‌ర్ పీకే మూవీ జీవిత‌కాల వ‌సూళ్లు రూ. 854 కోట్ల‌ను అధిగ‌మించింది కేజీఎఫ్ -2 మూవీ.

ప్ర‌శాంత్ నీల్ చిత్రం ఇప్పుడు ఈ వారం పూర్త‌య్యే స‌రికి ఊహించ‌ని రీతిలో రూ. 1000 కోట్లు దాటేసేందుకు రెడీ గా ఉంది. ప్ర‌శాంత్ నీల్ నిర్మాత‌తో క‌లిసి కేజీఎఫ్ మూవీని నిర్మించారు.

ఈ సంద‌ర్భంగా ఫిల్మ్ ట్రేడ్ అన‌లిస్ట్ మ‌నోబాల విజ‌య‌బాల‌న్ ఈ సంద‌ర్భంగా ట్వీట్ చేశాడు. కేజీఎఫ్ -2 మూవీ రూ. 883.56 కోట్లు కొల్ల‌గొట్టింద‌ని వెల్ల‌డించారు.

సినిమా రోజు వారీ వ‌సూళ్ల‌ను తెలిపాడు. ఆదివారం ఒక్క రోజే 50 శాతం వ‌సూళ్ల‌ను కొల్ల‌గొట్టంది. ప్ర‌పంచ వ్యాప్తంగా కేజీఎఫ్ మూవీ దుమ్ము రేపుతోంది. వ‌సూళ్లలో దూసుకు పోతోంది.

Also Read : ల‌తా మంగేష్క‌ర్ అవార్డు అందుకున్న మోదీ

Leave A Reply

Your Email Id will not be published!