Yashwant Sinha : యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు
వెంట వచ్చిన రాహుల్ గాంధీ, కేటీఆర్
Yashwant Sinha : విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా(Yashwant Sinha) సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు బీజేపీ సంకీర్ణ సర్కార్ (ఎన్డీయే) అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము దాఖలు చేశారు.
దీంతో పోటీ రసవత్తరంగా మారే చాన్స్ ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా సిన్హాకు మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ తరపున ఎంపీలతో పాటు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
సిన్హా ఓడి పోయే అవకాశం ఉన్నప్పటికీ అనేక మంది ప్రతిపక్ష నాయకులు బలం, ఐక్యతను ప్రదర్శించారు. ఆయన వెంట నేషనల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ , కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ ఉన్నారు.
వీరితో పాటు సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ , తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత అభిషేక్ బెనర్జీ, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఫరూఖ్ అబ్దుల్లా, ఆర్ ఎల్ డీ కి చెందిన జయంత్ సిన్హా, సీపీఎం నేత సీతారాం ఏచూరి , తదితరులు హాజరయ్యారు.
పార్లమెంట్ హౌస్ లో 84 ఏళ్ల వయస్సు కలిగిన మాజ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా ప్రతిపక్షాల నుంచి ఏకాభిప్రాయ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
చివరి నిమిషంలో టీఆర్ఎస్ సిన్హాకు మద్దతు ప్రకటించడం రాజకీయ వర్గాలలో కలకలం రేపింది. నిన్నటి దాకా తటస్థంగా ఉండాలని అనుకున్న ఆ పార్టీ తన స్టాండ్ ఏమిటో చెప్పకనే చెప్పింది.
దీంతో రాబోయే కాలంలో బేషరతుగా బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదపనుంది. ఈ మొత్తం ఎంపిక వ్యవహారం వెనుక టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రయత్నం చేశారు.
బలమైన ప్రతిపక్షం అన్నది లేక పోతే అది ప్రజాస్వామ్యం కాదని ఇప్పటికే ఆమె ప్రకటించారు.
Also Read : యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు