Yashwant Sinha : ఉద్దవ్ ఠాక్రేపై కేంద్రం బలవంతం – సిన్హా
కేంద్ర సర్కార్ పై సంచలన కామెంట్స్
Yashwant Sinha : విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న యశ్వంత్ సిన్హా సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ పై నిప్పులు చెరిగారు.
ప్రధానంగా ఆయన మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాను టార్గెట్ చేశారు. ఊహించని రీతిలో శివసేన పార్టీ ఎన్డీయే ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు యశ్వంత్ సిన్హా(Yashwant Sinha).
ముర్ముకు మద్దతు ఇవ్వాలంటూ శివసేన పార్టీ చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేపై(Uddhav Thackeray) ఒత్తిడి తీసుకు వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి ఎన్నికలకు ముందే ప్రతిపక్షాలను విచ్ఛిన్నం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని యశ్వంత్ సిన్హా ఆరోపించారు.
తాను రాజకీయ పార్టీతో పోరాడటం లేదని వివక్షా పూరితంగా వ్యవహరిస్తున్న కేంద్రంతో ఢీ కొంటున్నానని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిన్హా గౌహతిలో పర్యటించారు.
ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక కావాల్సి ఉండగా రాచరికపు పోకడలతో కేంద్రం వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు యశ్వంత్ సిన్హా.
ఉద్దవ్ ఠాక్రే ప్రారంభంలో తమకు బేషరతుగా మద్దతు ఇచ్చారని , కానీ కేంద్రం ఒత్తిడి దెబ్బకు మాట మార్చారని ద్రౌపది ముర్ము వైపు మొగ్గు చూపారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా శివసేన పార్టీకి పార్లమెంట్ లో 19 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇందులో లోక్ సభలో 16 సీట్లు ఉండగా రాజ్యసభలో 3 సీట్లు ఉన్నాయి.
కాగా తాజాగా యశ్వంత్ సిన్హా చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : పార్లమెంట్ లో నోరు జారితే జాగ్రత్త