Yati Narsinghanand : యతి నర్సింగానంద్ కామెంట్స్ కలకలం
మదర్సాలు కూల్చి వేస్తే బెటర్ - కేసు నమోదు
Yati Narsinghanand : స్వామీజి యతి నర్సింగానంద్ సరస్వతి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే హిజాబ్ వివాదం కర్ణాటకలో ప్రారంభమై దేశాన్ని అల్లకల్లోలం చేసింది.
ఇదే క్రమంలో బీజేపీ స్పోక్స్ పర్సన్ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర ఘటనలు చోటు చేసుకున్నాయి. పలుచోట్ల నిరసనలు మిన్నంటాయి.
ఈ తరుణంలో తాజాగా స్వామీజీ యతి నర్సింగానంద్(Yati Narsinghanand) చేసిన ఈ వ్యాఖ్యలపై ముస్లిం వర్గాలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం మోదీ కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
మదర్సాలను కూల్చి వేయాలని, అంతే కాకుండా అలీఘడ్ ముస్లిం యూనివర్శిటీని గన్ పౌడర్ ఉపయోగించి పేల్చి వేయాలంటూ పిలుపునిచ్చారు స్వామీజీ.
ఈ వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. హిందూ మహాసభ కార్యక్రమంలో పాల్గొనేందుకు నర్సింగానంద్ అలీఘడ్ ను సందర్శించారు.
ఆయనపై కేసు నమోదైంది. గుర్తింపు లేని మదర్సాలపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా సర్వే చేపట్టింది. ఎవరు పని చేస్తున్నారు. ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయి.
వారికి ఉన్న ప్రధాన అర్హతలు ఏమిటి. మదర్సాలలో ఏం బోధిస్తున్నారు. ఏమైనా ప్రేరేపిత ప్రసంగాలు, పాఠాలు ఉన్నాయా, ఎంత మంది పని చేస్తున్నారు.
అసలు వీళ్లు పిల్లలకు ఏం బోధిస్తున్నారు. ఏం నేర్పుతున్నారనే దానిపై పెద్ద ఎత్తున సర్వే చేపట్టింది. చైనా తరహాలో మదర్సాలను గన్ పౌడర్ తో పేల్చి వేయాలని పిలుపునిచ్చారు స్వామీజి.
వారి మెదళ్లలో చొచ్చుకు పోయిన ఖురాన్ అనే వైరస్ ను తొలగించాలన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read : స్వామి చిన్మయానందకు కోర్టు బిగ్ షాక్