Yediyurappa Chopper : యడియూరప్పకు తప్పిన ప్రమాదం
గాలి దుమారంతో ల్యాండ్ కాని హెలికాప్టర్
Yediyurappa Chopper : కర్ణాటక మాజీ సీఎం , భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు బీఎస్ యడియూరప్పకు(Yediyurappa) ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గాలి దుమారం కారణంగా ల్యాండింగ్ కాలేదు.
ప్రస్తుతం కర్ణాటకలో ఈ ఏడాది ఏప్రిల్ , మే నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం బీజేపీ అధిష్టానం మాజీ సీఎం యడియూరప్పను ప్రచార క్యాంపెయిన్ గా వాడుకుంటోంది.
తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొనేందుకు హెలికాప్టర్ లో వచ్చారు. ఇదే సమయంలో లాండింగ్ దిగేందుకు ఇబ్బంది ఎదురైంది. ముందు జాగ్రత్తగా పైలట్ జాగ్రత్త పడడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణాపాయం నుండి యడియూరప్ప బయట పడ్డాడు.
గాలి దుమారం ఎక్కువ కావడంతో హెలికాప్టర్ ను ల్యాండింగ్ చేయలేక పోయాడు.చాలా సేపు గాలి లోనే యడియూరప్ప(Yediyurappa Chopper) హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. కలబుర్గి జిల్లా జెవార్జీ వద్ద హెలికాప్టర్ ల్యాండ్ (దిగుతున్న) సమయంలో అకస్మాత్తుగా గాలి దుమారం చోటు చేసుకుంది.
ఇది ఊహించని పరిణామం. మొత్తంగా మొన్ననే మాజీ సీఎం యడియూరప్ప తన 80 వ పుట్టిన రోజు జరుపుకున్నారు. గాలిలో కొద్ది సేపు చక్కర్లు కొట్టాక హెలికాప్టర్ వెళ్లి పోయింది. ఇక యెడియూరప్ప కోసం పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన బీజేపీ సీనియర్లు యెడ్డి గురించి సమాచారం కనుక్కున్నారు.
Also Read : తీహార్ జైలుకు మనీష్ సిసోడియా