Yogi Akhilesh Yadav : వారిద్దరు ఒకరిపై మరొకరు నిన్నటి దాకా ఆరోపణలు చేసుకున్నారు. సవాళ్లు ప్రతిసవాళ్లతో ఉత్తరప్రదేశ్ రాజకీయాలను వేడెక్కించారు.
ఒకరు ప్రస్తుతం సీఎంగా కొలువు తీరిన భారతీయ జనతా పార్టీకి చెందిన యోగి ఆదిత్యానాథ్ కాగా మరొకరు సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ఒకరు సీఎం మరొకరు ప్రతిపక్ష నాయకుడు.
కొత్త కేబినెట్ కొలువు తీరిన వెంటనే ఇవాళ యూపీ శాసనసభ ప్రారంభమైంది. అనుకోని సన్నివేశానికి వేదికైంది సభ. విమర్శలు, ఆరోపణలు, దూషణల దాకా వెళ్లిన వీరిద్దరూ ఇవాళ చిరునవ్వులు చిందిస్తూ పలకరించు కోవడం సభకు హైలెట్ గా నిలిచింది.
దీంతో ఇద్దరూ కత్తులే. కానీ వీరిద్దరి కరచాలనం ఇప్పుడు సభికులనే కాదు సభ్యులను కూడా విస్తు పోయేలా చేసింది. సభా సంప్రాదాయం పాటించడం మర్యాద.
అందుకే సీఎంగా రెండోసారి కొలువు తీరిన యోగి ఆదిత్యానాథ్ నేరుగా వెళ్లి ప్రతిపక్ష నేతగా ఎన్నికైన అఖిలేష్ యాదవ్(Yogi Akhilesh Yadav) వద్దకు వెళ్లి పలకరించారు. వీరిద్దరూ ఒకరినొకరు కుశల ప్రశ్నలు అడిగారు.
ఆ తర్వాత తమ తమ సీట్లలో ఆసీనులయ్యారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరన్న దానిని వీరిద్దరూ నిజం చేశారు.. మొత్తంగా ఇదే ఫ్రెండ్ షిప్ కంటిన్యూ అవుతుందా లేక ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుతారా అన్నది వేచి చూడాలి.
ఇదే సమయంలో సీఎం వెళుతుండగా భుజం మీద వెన్ను తట్టడం సభకు హైలెట్ గా నిలిచింది. ఇదిలా ఉండగా తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ 273 సీట్లు గెలిస్తే ఎస్పీ 125 సీట్లు గెలుపొందింది.
Also Read : రాకేశ్ తికాయత్ కు ప్రాణహాని