Yogi Adityanath : తెలంగాణ – బలిదానాల సాక్షిగా ఏర్పడిన తెలంగాణలో గాయాలు తప్ప ఇంకేమీ మిగల లేదన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యా నాథ్. మాయ మాటలతో జనాన్ని బురిడీ కొట్టించడం తప్ప కేసీఆర్ రాష్ట్రానికి, ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం పాల్గొని ప్రసంగించారు. దొర, గడీల పాలనను జనం తట్టుకోలేక పోతున్నారని ఆవేదన చెందారు.
Yogi Adityanath Comments on KCR Ruling
తాను సీఎంగా ఉన్నానని కానీ ఏనాడూ అధికార దర్పాన్ని ప్రదర్శించ లేదన్నారు యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath). పదవులు శాశ్వతం కాదన్నారు. కానీ మనం చేసిన పనే మనల్ని గెలిపించేలా చేస్తాయని స్పష్టం చేశారు. కానీ కేసీఆర్ తాను దైవాంస సంభూతుడినని తనకు తానుగా భావిస్తున్నారని ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
గడీల పాలనలో లెక్కకు మించిన గాయాలు ఉన్నాయని వీటిని పూర్తిగా మానేలా చేయాలంటే కేవలం బీజేపీ నుంచి మాత్రమే సాధ్యమవుతుందన్నారు యోగి ఆదిత్యానాథ్. ప్రజలు పాలన సాగించమని గెలిపిస్తే సచివాలయానికి రాకుండా, ప్రజా దర్బార్ నిర్వహించకుండా ఫామ్ హౌస్ కే పరిమితం అవుతే ఎలా అని కేసీఆర్ ను ప్రశ్నించారు.
జనం మార్పు కోరుకుంటున్నారని వారంతా బీజేపీ రావాలని కంకణ బద్దులై ఉన్నారని స్పష్టం చేశారు యూపీ సీఎం.
Also Read : JP Nadda : సీఎం ఖేల్ ఖతం – జేపీ నడ్డా