Yogi Adityanath : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath). రాష్ట్రంలో తాజాగా 403 సీట్లకు గాను భారతీయ జనతా పార్టీ ఏకంగా కూటమి 273 సీట్లను కైవసం చేసుకుంది.
2017లో జరిగిన ఎన్నికల్లో 317 సీట్లు గెలుచుకోగా ఈసారి సీట్లు తక్కువగా వచ్చాయి. 41.29 శాతం ఓట్లు వచ్చాయి. 37 సంవత్సరాల రికార్డ్ ను తిరగ రాశారు యోగి ఆదిత్యానాథ్. సీఎంతో పాటు 27 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
శుక్రవారం లక్నో స్టేడియంలో కిక్కిరిసిన జనసందోహం మధ్య ముఖ్యమంత్రిగా కొలువు తీరారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , బీజేపీ అగ్ర నేతలు, బాలీవుడ్ రంగానికి చెందిన తారలు హాజయ్యారు.
రెండోసారి సీఎంగా కొలువు తీరి యోగి సీఎం చరిత్ర సృష్టించారు. సీఎంకు తోడుగా డిప్యూటీ సీఎంలుగా కేటాయించారు. యూపీ ఎన్నికల్లో ఓడి పోయిన కేశవ్ ప్రసాద్ మౌర్య ఉప ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.
కాగా దినేష్ శర్మ స్థానంలో బ్రాహ్మణ నాయకుడు బ్రజేష్ పాఠక్ ను తీసుకోనున్నారు. ఈసారి ఎన్నికల్లో యోగి అన్నీ తానై ముందుండి నడిపించాడు పార్టీని. రాష్ట్రంలో పూర్తి పదవీ కాలం పూర్తయిన తర్వాత పవర్ లోకి వచ్చిన వ్యక్తిగా నిలిచారు.
ఇదిలా ఉండగా లక్నో లోని అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియం పూర్తిగా క్రిక్కిరిసి పోయింది. స్టేడియం అంతటా నయే భారత్ కా నయా యూపీ .
న్యూ యూపీ ఆఫ్ న్యూ ఇండియా అంటూ పోస్టర్లు వెలిశాయి. లక్నో అంతా కాషాయమయంగా మారింది.
Also Read : ఎమ్మెల్యేలకు ఒకే పెన్షన్ వర్తింపు – మాన్