Yogi Adityanath : యోగి దెబ్బకు గ్యాంగ్ స్టర్లు లొంగుబాటు
సీఎం వల్లే సరెండర్ అవుతున్నట్లు ప్రకటన
Yogi Adityanath : ఉత్తర ప్రదేశ్ లో నేరస్థులు గజగజ వణుకుతున్నారు. ఒకప్పుడు జనాన్ని, వ్యాపారస్తులను టార్గెట్ చేస్తూ విచ్చలవిడిగా నేరాలకు పాల్పడిన వారంతా ఇప్పుడు తమను రక్షించమంటూ వేడుకుంటున్నారు.
యోగి సీఎంగా కొలువు తీరాక సీన్ మారింది. సరెండర్ బాట పట్టేందుకు రెడీ అయ్యారు. ఇవాళ ఐదుగురు గ్యాంగ్ స్టర్లు లొంగి పోయారు. తామంతా సీఎం యోగి ఆదిత్యానాథ్ (Yogi Adityanath) పిలుపునకు ప్రభావితమైనట్లు తెలిపారు.
వీరంతా అక్రమ మద్యం తయారీ, విక్రయాలకు పాల్పడుతున్నట్లు షాజహాన్ పూర్ ఎస్పీ ఎస్. ఆనంద్ వెల్లడించారు. లిక్కర్ మాఫియా గ్యాంగ్ స్టర్లు గా పేరొందారు. వీరంతా నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోతున్నట్లు ప్రకటించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కశ్మీర్ సింగ్ , రోషన్ సింగ్ , దేశ రాజ్ సింగ్ , చమన్ సంగ్ , గుర్మీత్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.
తాము మద్యం తయారీలో నిమగ్నమై ఉన్నామని, కానీ సీఎం పిలుపు ఇవ్వడంతో తాము వాటిని మానేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు మెడల్లో ప్ల కార్డులు కూడా ప్రదర్శించడం విశేషం.
ఇక నుంచి తాము ఈ వ్యాపారానికి దూరంగా ఉంటామని తెలిపారు. ఖుతార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోనియా లో వీరి ఆటలు సాగాయి. గత కొన్నేళ్ల నుంచి గ్యాంగ్ స్టర్లపై ఉక్కు పాదం మోపారు సీఎం ఆదిత్యానాథ్.
చాలా మంది ని ఎన్ కౌంటర్ కూడా చేపించడంతో తమను చంప వద్దంటూ కోరుతున్నారు. లొంగిపోతారా చస్తారా అన్న స్లోగన్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read : రైతు ఆవిష్కరణలను ప్రోత్సహించాలి