Maharashtra Governor : మీరు మైనార్టీలో ఉన్నారు – గవర్నర్
సీఎం ఉద్దవ్ ఠాక్రేకు లేఖలో వెల్లడి
Maharashtra Governor : మరాఠా రాజకీయం ఇప్పుడు గవర్నర్ ను దాటి సుప్రీంకోర్టుకు చేరింది. ఓ వైపు రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయొద్దంటూ కోర్టు డిప్యూటీ స్పీకర్ ను ఆదేశించింది.
దానిపై తీర్పు రాకుండానే గవర్నర్ ఎలా బలపరీక్ష నిరూపించు కోవాలంటూ ఎలా ఆదేశిస్తారంటూ ప్రశ్నించింది శివసేన.
ఇదే విషయాన్ని నిలదీశారు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో రాజకీయ చదరంగం మరింత వేడిని పుట్టిస్తోంది.
ఈ తరుణంలో సీఎం ఉద్దవ్ ఠాక్రేకు మీరు మైనార్టీలో ఉన్నారంటూ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు లేఖ రాయడం ఇప్పుడు కలకలం రేగింది.
ఇదంతా కేంద్రం కావాలని నాటకం ఆడుతోందని, రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చేలా వ్యవహరిస్తోందంటూ సంజయ్ రౌత్ ఆరోపించారు.
ఇదిలా ఉండగా గవర్నర్ లేఖ రాయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు సీఎం. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఇక ఆ లేఖలో భారతీయ జనతా పార్టీ, ఇతర ఎమ్మెల్యేల నుండి తనకు లేఖలు అందాయని కోష్యారీ పేర్కొన్నారు.
మహా వికాస్ అఘాడి ప్రభుత్వం నుండి వైదొలగాలని భావిస్తున్నట్లు శివసేన ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది సూచన చేశారని తెలిపారు. దీంతో మీరు, మీ ప్రభుత్వం సభా విశ్వాసాన్ని కోల్పోయిందని , ప్రభుత్వం మైనార్టీలో ఉందని తాను విశ్వసిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇదంతా రికార్డు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గవర్నర్(Maharashtra Governor) ఆదేశించడం చట్ట విరుద్దమని ఆరోపించారు సీఎం ఉద్దవ్ ఠాక్రే(Udhav Thackray).
Also Read : గవర్నర్ నిర్ణయం సంజయ్ రౌత్ ఆగ్రహం