Sanjay Raut Shinde : ముందు మ‌రాఠాలో కాలు పెట్టండి – రౌత్

ప్ర‌తి నిర్ణ‌యంలోనూ షిండే పాత్ర ఉంది

Sanjay Raut Shinde : శివ‌సేన పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ రౌత్(Sanjay Raut Shinde) షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్రం కావాల‌ని చేసిన ప్ర‌య‌త్నమ‌ని ఆరోపించారు.

ఈడీ వ‌త్తిళ్ల మ‌ధ్య వారున్నారు. ఇది నిజం. ఇక సంజ‌య్ రౌత్ ఇప్పుడు మ‌రాఠా రాజ‌కీయాల‌లో కీల‌కంగా ఉన్నారు. ఆయ‌న మొద‌టి నుంచి శివ‌సేన‌కు వాయిస్ గా ఉంటూ వ‌చ్చారు.

అటు కేంద్రంతో ఇటు రాష్ట్రంలో కీల‌క పాత్ర పోషించారు. ఉద్ద‌వ్ ఠాక్రేకు విధేయుడిగా ఉన్నారు. ఎవ‌రైతే విలీనం చేయాల‌ని కోరుతున్నారో ఆ పార్టీనే త‌మ‌తో విలీనం చేస్తే స‌రి పోతుందంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

గురువారం సంజ‌య్ రౌత్ మీడియాతో మాట్లాడారు. ఎక్ నాథ్ షిండే(Sanjay Raut Shinde) నేతృత్వంలోని పార్టీ తిరుగుబాటు శిబిరాన్ని బ‌ల‌ప‌రీక్ష‌కు స‌వాల్ చేశారు.

అదే స‌మ‌యంలో పార్టీలోకి తిరిగి వ‌చ్చే అవ‌కాశం ఇంకా కోల్పోలేద‌ని స్ప‌ష్టం చేశారు ఎంపీ. తాము ఎన్సీపీ, కాంగ్రెస్ ను వ‌దిలి వెళ్లే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.

ఇదే స‌మ‌యంలో షిండే డిమాండ్ అర్ద‌ర‌హిత‌మ‌న‌ద‌ని పేర్కొన్నారు. షిండే చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. ఏడాది పాటు క‌రోనా ఆంక్ష‌లు కొన‌సాగుతూ వ‌చ్చాయి.

ఆపై సీఎం అనారోగ్యంతో ఉన్నారు. ఇదే స‌మ‌యంలో రాష్ట్రానికి సంబంధించి సీఎం తీసుకున్న ప్ర‌తి నిర్ణ‌యంలో ఏక్ నాథ్ షిండే పాత్ర ఉంద‌న్నారు.

ఆయ‌న‌కు తెలియ‌కుండా ఏదీ చేయ‌లేద‌న్నారు సంజ‌య్ రౌత్. బాలా సాహెబ్ ఠాక్రే కాలంలో కూడా చాలా మంది పార్టీని వీడారు. కానీ మేం ఎక్క‌డికీ వెళ్ల‌లేదు. తిరిగి పార్టీని పున‌ర్ నిర్మించామ‌న్నారు.

Also Read : శివ‌సేన ఎమ్మెల్యేల‌కు నిర‌స‌న సెగ‌

Leave A Reply

Your Email Id will not be published!