Ashok Gehlot : కాలం కలిసొస్తే పదవులు వరిస్తాయి – గెహ్లాట్
రాజస్థాన్ సీఎం సంచలన కామెంట్స్
Ashok Gehlot : రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా సోమవారం తన ఓటు హక్కు వినియోగించకున్నారు. తన ఓటు సోనియా విధేయుడైన మల్లికార్జున్ ఖర్గేకే వేసి ఉంటారని ప్రచారం జరిగింది. ఇక ఖర్గేకు మద్దతు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు పోటీలో ఉన్న ఎంపీ శశి థరూర్.
ఇది పక్కన పెడితే తనకు పోటీదారుగా ఉన్న సచిన్ పైలట్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం. కాలం కలిసి వస్తే యువ నాయకులకు సరైన సమయంలో పదవులు లభిస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన జ్యోతిరాదిత్యా సింధియా, ఆర్పీఎన్ సింగ్ , జితిన్ పర్సాదా వంటి నేతలను అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) అవకాశ వాదులు అంటూ ఆరోపించారు.
అయితే వారంతా చిన్న వయస్సులోనే కేంద్ర మంత్రులు అయ్యారంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని, యువ నాయకులు కష్టపడి పని చేయాలని కోరారు. శ్రమించి పార్టీ కోసం పని చేసిన వారికి తప్పకుండా పదవులు దక్కేలా చూస్తుందన్నారు. ఏ స్థాయి లోనూ అనుభవానికి ప్రత్యామ్నాయం లేదన్నారు.
సమయం వచ్చినప్పుడే వారికి అవకాశాలు దక్కుతాయని తెలుసు కోవాలన్నారు అశోక్ గెహ్లాట్. కాగా తామంతా పదవులను ఆశించి పార్టీలోకి రాలేదన్నారు. పని చేస్తూ ఈ స్థాయికి ఎదిగామన్నారు.
తనకు రాజకీయాలు అస్సలు తెలియవని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమయం వచ్చేంత వరకు ఓపికతో వేచి చూడాలని సూచించారు అశోక్ గెహ్లాట్.
Also Read : ఎవరు ఎన్నికైనా గాంధీల మాట వినాలి