Modi U19 India : వెస్టిండీస్ వేదికగా జరిగిన అండర్ -19 వరల్డ్ కప్ ను ఇంగ్లండ్ ను ఓడించి విశ్వ విజేతగా నిలిచిన యువ భారత్ జట్టుపై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇప్పటికే బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఇదే సమయంలో భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ(Modi U19 India) విశ్వ భారత జట్టును ప్రత్యేకంగా అభినందించారు.
మీరు సాధించిన విజయం అపురూపం. అద్భుతం. ఈ దేశ భవిష్యత్తు యావత్ యువతీ యువకులపైనే ఉందన్న నరేంద్రుడు చెప్పిన విషయాన్ని మీరు ఆచరణలో చేసి చూపించారని కొనియాడారు.
ఈ గెలుపు సాధారణమైనది కాదు. ఎంతో కష్టపడి సాధించారు. ఓ వైపు కరోనా కొందరి ఆటగాళ్లకు సోకినా ఎక్కడా తగ్గకుండా ప్రపంచ కప్ ను తీసుకు వచ్చారు. మీరు సత్తా చాటారు.
భారత జట్టుకు ఎదురే లేదని చాటారు. దేశ క్రికెట్ భవిష్యత్తుకు ఇది మరింత సపోర్ట్ గా నిలుస్తుందని పేర్కొన్నారు మోదీ. మిమ్మల్ని, మీ ఆటను, సాధించిన ఈ అద్వితీయ గెలుపును చూసిన నాకు చాలా సంతోషంగా ఉందని స్పష్టం చేశారు ప్రధానమంత్రి.
మోదీ అధికారికంగా ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత్ అండర్ 19 (Modi U19 India)క్రికెట్ జట్టుకు నా హృదయ పూర్వక అభినందనలు.
విజేతగా నిలిచి ఆట తీరుతో ఆకట్టుకున్నారు. ఈ విజయం ఎంతో గర్వ కారణం దేశానికి. ప్రధానంగా భారత క్రీడావనిలో మరో కీర్తిని, విజయాన్ని, ట్రోఫీని జోడించింది. వెల్ డన్ బాయ్స్ ఇలాగే మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.
Also Read : వెయ్యో వన్డేలో టీమిండియా విక్టరీ