YS Jagan : అన్న‌దాత‌ల‌కు జ‌గ‌న‌న్న తీపి క‌బురు

28న రైత‌న్న‌ల అకౌంట్ల‌లో జ‌మ

YS Jagan : ఎన్ని అడ్డంకులు ఎదురైనా స‌రే అనుకున్న‌ది సాధించే అల‌వాటు ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిది(YS Jagan). ఆయ‌న కొలువు తీరాక ఫ‌స్ట్ ప్ర‌యారిటీ రైతుల‌కు ఇచ్చారు. విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయం, మ‌హిళా సాధికారత‌, టెక్నాల‌జీ పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు. ఇందులో భాగంగా దేశంలో ఎక్క‌డా లేని విధంగా సీఎం రైతు భ‌రోసా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు.

అంతే కాదు రైతుల‌కు అవ‌స‌ర‌మైన పెట్టుబ‌డిని కూడా అంద‌జేస్తున్నారు. ఈ త‌రుణంలో తాజాగా శుభ‌వార్త చెప్పారు ఏపీ సీఎం. ఈనెల 28న రైతులకు సంబంధించి పంట న‌ష్ట ప‌రిహారాన్ని, బ‌కాయిలు ఉన్న సున్నా వ‌డ్డీ మొత్తాన్ని నేరుగా రైతుల అకౌంట్ల‌లో జ‌మ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఈ మేర‌కు ఏపీ ప్ర‌భుత్వం సీఎం ఆదేశాల మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఏపీలో భారీగా వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు , వైప‌రీత్యాలు చోటు చేసుకున్నాయి. వీటి కార‌ణంగా వేలాది ఎక‌రాల‌లో పంట‌లు న‌ష్ట పోయారు రైతులు. గ‌తంలో సీజ‌న్ ముగిశాక పంట సాయం అంద‌జేసేవారు. కానీ సీన్ మారింది.

ఈసారి అంత‌క‌న్నా ముందే ఇవ్వాల‌ని సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(YS Jagan) నిర్ణ‌యించారు. పంట‌లు న‌ష్ట పోయిన రైతుల‌కు తీపి క‌బురు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల మందికి పైగా రైతుల‌కు చెందిన 60 వేల 832 ఎక‌రాల్లో పంట‌లు న‌ష్ట పోయిన‌ట్లు స‌ర్కార్ గుర్తించింది. ఈ మేర‌కు వారంద‌రికీ ఆరోజున వారి ఖాతాల్లో న‌గ‌దును జ‌మ చేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.

దీని వ‌ల్ల న‌ష్ట పోయిన అన్న‌దాత‌ల‌కు ఒకింత మేలు చేకూర‌నుంది.

Also Read : మ‌ల్ల‌న్న‌తో పాటు డైరెక్టర్ల‌కు నోటీసులు

Leave A Reply

Your Email Id will not be published!