Ys Jagan: చంద్రబాబును నమ్ముకుంటే ప్రజలైనా అంతే… నాయకులైనా అంతే : వైఎస్ జగన్
చంద్రబాబును నమ్ముకుంటే ప్రజలైనా అంతే… నాయకులైనా అంతే : వైఎస్ జగన్
Ys Jagan: ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులతో బుధవారం ఆయన భేటీ అయ్యారు.
Ys Jagan Comment
‘‘ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తిరుగులేని మెజార్టీలు సాధించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి తగిన సంఖ్య బలం లేదు. నైతికలు విలువలు పాటిస్తే గనుక ఆ పార్టీ పోటీ పెట్టకూడదు. గెలిచినవారంతా ఆయా పార్టీల గుర్తుల మీద గెలిచినవారు. మీ జగన్(Ys Jagan) ముఖ్యమంత్రిగా ఉండింటే… విలువలు పాటిస్తూ పోటీకి పెట్టేవారం కాదు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
చంద్రబాబును నమ్ముకుంటే ప్రజలైనా అంతే… నాయకులైనా అంతే.. ఇంతకు ముందు మన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు వెళ్లారు. వారిలో చంద్రబాబు ఎంతమందికి టిక్కెట్లు ఇచ్చారు?. డబ్బులు ఇస్తానన్నారు? కాని ఎంత ఇచ్చారు?
ప్రజల్లో ఒక్కసారి పలుచబడ్డాక గౌరవం పోతుంది. చంద్రబాబు దగ్గరకు వెళ్లినవారి రాజకీయ జీవితాలు ఏమయ్యాయి? ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. కష్టమైనా సరే విలువలు, విశ్వసనీయతతో కూడిన దారి ఎంచుకోవాలి. ఆ రాజకీయాలే చిరస్థాయిగా నిలబడతాయి. ఇదే వైఎస్సార్‌సీపీ బలంగా నమ్మే సిద్ధాంతం. మాలో అబద్ధాలు ఉండవు, మోసాలు ఉండవు, కల్మషం ఉండదు అని ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకోగలగాలి. ఈ ఎన్నికల్లో గెలిచినవారు, పోటీచేసిన అభ్యర్థులు అందరూ కూడా బొత్స పేరును ఏకగ్రీవంగా నిలబెట్టారు. బొత్స గెలుపుకు మీరంతా అండగా ఉండాలి’’ అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
Also Read : Handloom Day: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నేరుగా కలిసి ఆయనకు లఘు చిత్రాన్ని అందజేసిన కలిశెట్టి