YS Jagan : ఏపీ మాజీ సీఎం జగన్ పుంగనూరు పర్యటన రద్దు
ఓ మహిళ సహా మెుత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు...
YS Jagan : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) పుంగనూరు పర్యటన రద్దు అయ్యింది. పుంగనూరులో చిన్నారిని కిడ్నాప్ చేసి ఆపై దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హత్యకు గురైన చిన్నారి అస్పియా కుటుంబసభ్యులను పరామర్శించేందుకు ఈనెల 9న జగన్ పుంగనూరుకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే జగన్(YS Jagan) పుంగనూరు(Punganur) పర్యటనను రద్దు చేసుకున్నట్లు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. చిన్నారి హత్య విషయంలో నేరస్తులను ప్రభుత్వం అరెస్ట్ చేసినందున జగన్ పర్యటన రద్దు చేసుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి రామాచంద్రారెడ్డి వెల్లడించారు.
YS Jagan Punganur….
కాగా.. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బాలిక ఆస్పియా హత్య కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు వెల్లడించారు. పుంగనూరులో సెప్టెంబర్ 29న ట్యూషన్‌కు వెళ్లి ఇంటికి వచ్చిన ఆస్పియా(7) ఆ తర్వాత అదృశ్యమైంది. కుటుంబసభ్యులు ఎంత వేతికినా ప్రయోజనం లేకుండా పోయింది. మూడ్రోజుల తర్వాత పుంగనూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో డెడ్ బాడీ లభించడంతో హత్య కేసు సంచలనంగా మారింది. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నిందితులను పట్టుకోవాల్సిందిగా చిత్తూరు ఎస్పీ మణికంఠను ఆదేశించగా.. విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నగదు లావాదేవీలే బాలిక హత్యకు కారణంటూ ఎస్పీ మణికంఠ తేల్చిచెప్పారు. బాలిక తండ్రి అజ్మతుల్లా నడుపుతున్న ఫైనాన్స్ వ్యాపారంలో నెలకొన్న లావాదేవీల వివాదమే బాలికను హత్య చేయడానికి దారి తీశాయని ఎస్పీ వెల్లడించారు.
ఓ మహిళ సహా మెుత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రచారం జరుగుతున్నట్లుగా చిన్నారిపై అత్యాచారం జరగలేదని ఎస్పీ మణికంఠ తేల్చి చెప్పారు. ఆ విషయం పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైందని ఆయన తెలిపారు. గత నెల 29న సాయంత్రం బుర్కా వేసుకుని వచ్చిన ఓ మహిళ బాలికకు చాక్లెట్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్లిపోయిందని, అనంతరం చిన్నారి నోరు, ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి చంపేశారని ఎస్పీ తెలిపారు. అనంతరం ఆస్తీయా మృతదేహాన్ని నిందితులు ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో పడేసినట్లు విచారణలో తేలిందని ఎస్పీ మణికంఠ వెల్లడించారు. మెుత్తం 12 టీమ్స్‌ను ఏర్పాటు చేసి చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అయితే అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ఆస్పియా మృతదేహాన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో గుర్తించినట్లు ఎస్పీ వెల్లడించారు. హత్య జరిగిందని తెలిసిన వెంటనే పోలీసులను అలర్ట్ చేశామని, అన్ని కోణాల్లో విచారణ చేపట్టి నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు.
Also Read : Arvind Kejriwal : ‘జనతా కి అదాలత్’ కార్యక్రమంలో మోదీకి సవాల్ విసిరిన కేజ్రీవాల్