YS Jagan YSR : నాన్నే నా బలం బలగం – జగన్
ఫాదర్స్ డే సందర్భంగా ఏపీ సీఎం
YS Jagan YSR : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన తండ్రిని తలుచుకున్నారు. జూన్ 18న ఆదివారం యావత్ ప్రపంచం ఫాదర్స్ డేను జరుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా సీఎం ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన తండ్రి తనకు స్పూర్తి దాయకంగా నిలిచారని పేర్కొన్నారు. వైఎస్సార్ తనకు బలమని, ఆయనే తనకు అండ అని స్పష్టం చేశారు జగన్ రెడ్డి.
దివంగత తండ్రితో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జీవితంలో తనకు ఏం కావాలన్నా ఇచ్చారని పేర్కొన్నారు. ఆయన ప్రతి అడుగు ప్రజల కోసం పని చేశారని కొనియాడారు. ఆయన బాటలోనే తాను అడుగులు వేస్తున్నానని స్పష్టం చేశారు జగన్ రెడ్డి.
ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే ప్రధాన కారణం తల్లిదండ్రులు అందించిన ప్రేరణ, ఆదరాభిమానాలేనని పేర్కొన్నారు. వారందించిన ప్రేమ అపురూపమైనదని, దానిని కొలిచేందుకు నా దగ్గర ఎలాంటి సాధనాలు లేవని అన్నారు. నాకు నమ్మకమైన స్నేహితుడిగా ఉన్నారు. అంతకు మించి తనకు వైఎస్సార్(YSR) మొదటి హీరో అని కొనియాడారు.
ఇవాళ మా మధ్య లేరు. కానీ మా గుండెల్లో, కోట్లాది ప్రజల హృదయాలలో నిలిచే ఉన్నారని ప్రశంసించారు. ఇవాళ ఫాదర్స్ డే జరుపుకుంటున్న తండ్రులకు, పిల్లలకు నా తరపున హృదయ పూర్వకమైన అభినందనలు తెలియ చేస్తున్నానని స్పష్టం చేశారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి.
Also Read : Nara Lokesh Chandrababu : నాన్నా నువ్వే నా హీరో – లోకేష్