YS Sharmila KCR : కేసీఆర్ కు వైఎస్ షర్మిల సవాల్
దమ్ముంటే కలిసి నడువు
YS Sharmila KCR : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. దమ్ముంటే తనతో కలిసి పాదయాత్రలో నడవాలని, ఇందు కోసం సీఎంకు ప్రత్యేకంగాను తాను షూస్ బహూకరించేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆయన తన వెంట నడిస్తే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో, ఏయే సమస్యలతో సతమతం అవుతున్నారో తెలుస్తుందన్నారు.
గురువారం వైఎస్ షర్మిల తిరిగి పాదయాత్రను ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలం అయ్యాడని ఎద్దేవా చేశారు. పాదయాత్రలో కేసీఆర్ కాళ్లు నొప్పి పెట్టకుండా ఉండేందుకే తాను షూస్ ను బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించారు వైఎస్ షర్మిల.
దమ్ముంటే తన పాదయాత్రలో సీఎం పాల్గొనాలని ఆమె సవాల్ విసిరారు. గతంలో తనను పాదయాత్ర జరగ నీయకుండా అడ్డుకున్న ప్రాంతం నుంచే తిరిగి యాత్ర చేపడతానని ఎవరు అడ్డం వస్తారో చూసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని ఆరోపించారు వైఎస్ షర్మిల. ఇది బంగారు తెలంగాణ అంటూ పదే పదే చెబుతున్నారు.. ఒక వేళ ఎలాంటి సమస్యలు లేవని తేలితే తాను రాజకీయాల నుంచి తక్షణమే తప్పుకుంటానని ప్రకటించారు వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) .
కానీ ఇది నిజం కాక పోతే కేసీఆర్ రాజీనామా చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం దళితుడిని సీఎం చేయాలన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ మాట నిలబెట్టు కోలేదంటూ మండిపడ్డారు. కేసీఆర్ చేసిన వాగ్ధానాలలో ఒక్కటి కూడా అమలు చేసిన పాపాన పోలేదన్నారు.
Also Read : వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ కలకలం