YS Sharmila : పంటలు కోల్పోయిన రైతులకు దిక్కేది
వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల
YS Sharmila : తెలంగాణలో అకాల వర్షాల తాకిడికి రైతులు తమ పంటలను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల. ఆదివారం ఆమె ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో పర్యటించారు.
అకాల వర్షాల తాకిడికి పెద్ద ఎత్తున పంటలు కోల్పోయారు. కొణిజర్ల మండలంలో వేల ఎకరాల్లో మొక్క జొన్న పంట నేల పాలైంది. తీవ్రంగా నష్ట పోయిన రైతులను ఆదుకోవాల్సిన సర్కార్ ఇప్పటి వరకు ఒక్క ప్రకటన కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల(YS Sharmila).
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనీసం 30 వేలకు పైగా ఎకరాలలో వివిధ పంటలను రైతులు నష్ట పోయారని పేర్కొన్నారు. పంటలు కోల్పోయిన రైతులను ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. పూర్తి పంట నష్ట పరిహారాన్ని వెంటనే చెల్లించాలని కోరారు. అత్యవసర నిధి కింద సహాయం చేయాలని సూచించారు వైఎస్ షర్మిల(YS Sharmila).
పంటలు కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్నా ఇప్పటి వరకు ఎందుకు సీఎం కేసీఆర్ పరామర్శించ లేదని ప్రశ్నించారు ఆమె. రాష్ట్రంలో పాలన పడకేసిందని , ఓ వైపు చిన్న వర్షానికే భాగ్యనగరం అభాగ్య నగరంగా మారుతోందని ఎద్దేవా చేశారు. దేశానికే తల మానికమని పదే పదే చెబుతున్న సర్కార్ ఇప్పటి వరకు ఏం చేసిందో చెప్పాలన్నారు. భూ కబ్జాలకు పాల్పడడంపై ఉన్నంత ఫోకస్ రైతులను ఆదుకోవడంపై లేదని మండిపడ్డారు వైఎస్ షర్మిల.
Also Read : కాంట్రాక్టు కార్మికులు పారా హుషార్