YS Sharmila Arrest : వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
నా కాంపౌండ్ లో దీక్ష చేస్తే తప్పా
YS Sharmila TSPSC Arrest : పేపర్ లీకేజీ వ్యవహారాన్ని నిరసిస్తూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) ఆధ్వర్యంలో శుక్రవారం శాంతియుతంగా టీఎస్ పీఎస్సీ కార్యాలయం వద్దకు బయలు దేరేందుకు సిద్దమయ్యారు.
దీంతో పోలీసులు ఆమెను వెళ్లనీయలేదు. తన ఇంటి వద్దనే అడ్డుకున్నారు. వైఎస్ షర్మిలను హౌస్ అరెస్ట్(YS Sharmila TSPSC Arrest) చేశారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ పేరుతో మోసం చేశాడని ఆరోపించారు.
10 లక్షల మంది పరీక్షలు రాస్తే అవి లీక్ అయ్యాయని ఇక ఎవరు రాష్ట్రాన్ని కాపాడాలని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది బలిదానాలు చేసుకుంటే రాష్ట్రం ఏర్పడిందన్నారు. 55 లక్షల మంది జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. గత ఏడాది ఇచ్చిన నోటిఫికేషన్లకు ఒక్క పరీక్ష కూడా సరిగా నిర్వహించిన పాపాన పోలేదన్నారు. గతంలో నిర్వహించిన పరీక్షలను కూడా రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ పేపర్ లీక్ వ్యవహారంలో చైర్మన్ , సెక్రటరీ , సభ్యులు, బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి స్కాంకు పాల్పడ్డారంటూ ఆరోపించారు. ఐటీ హబ్ అని చెప్పుకుంటున్న మంత్రి కేటీఆర్ కు సిగ్గు అనేది ఉందా అని ప్రశ్నించారు. ఆయన ఏం పని చేస్తున్నారంటూ నిలదీశారు. ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
సిగ్గు లేకుండా లిక్కర్ స్కీంలో ఇరుక్కున్న ఎమ్మెల్సీ కవిత కోసం తిప్పలు పడుతున్నారని మండిపడ్డారు వైఎస్ షర్మిల. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చోటు చేసుకున్న అక్రమాలపై సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
Also Read : అన్ని పరీక్షలను రద్దు చేయాలి – షర్మిల