YS Sharmila Meets : కోదండరాంను కలిసిన వైఎస్ షర్మిల
టిసేవ్ పోరుకు నాయకత్వం వహించాలి
YS Sharmila Meets : తెలంగాణ జన సమితి పార్టీ చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్ ను వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల కలిశారు. మంగళవారం స్వయంగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా తమతో పోరాడేందుకు కలిసి రావాలని కోరారు. ఈ మేరకు సుదీర్ఘ లేఖ కోదండరామ్ కు అందజేశారు వైఎస్ షర్మిల(YS Sharmila Meets).
రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఇవాళ ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. ప్రజా సమస్యలపై జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటేనని , ప్రతిపక్షాలు కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం తెలంగాణలో నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు వైఎస్ షర్మిల. ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ కు సోయి అన్నది లేకుండా పోయిందన్నారు. ప్రశ్నించే వాళ్లను అణగదొక్కేందుకు యత్నిస్తున్నారంటూ ఆరోపించారు.
ప్రతిపక్షాలు ఏకమై పోరాడితే తప్ప, ఉద్యమిస్తే తప్పా నిరుద్యోగులకు న్యాయం జరగదన్నారు. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరువును తీశారంటూ మండిపడ్డారు. వెంటనే చైర్మన్ , సెక్రటరీ, సభ్యులను తొలగించాలని సీబీఐ, ఈడీతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల.
Also Read : క్షమాపణ చెప్పండి రాజీనామా చేయండి