YS Sharmila : జాబ్స్ కోసం ఇంకెంత మంది చావాలి
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల కామెంట్స్
YS Sharmila Naveen Suicide : ఇంకెంతమంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటారంటూ ప్రశ్నించారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల. ఆదివారం ఆత్మహత్య చేసుకున్న నవీన్ కుటుంబాన్ని(YS Sharmila Naveen Suicide) ఆమె పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చోటు చేసుకున్న పేపర్ లీక్ వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలన్నారు. అసలు దోషులను విడిచి పెట్టి కేవలం ఇద్దరి వల్లనే ఇది జరిగిందంటూ మంత్రి కేటీఆర్ చెప్పడం సిగ్గు చేటు అన్నారు.
సిట్ దర్యాప్తు వల్ల లాభం జరగదని , అసలు వాస్తవాలు తెలియాలంటే వెంటనే సీబీఐతో విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పటి కమిషన్ చైర్మన్ ను తొలగించాలని 2015 నుంచి చేపట్టిన నియామకాల పై కూడా విచారణ జరపాలని అన్నారను వైఎస్ షర్మిల. నవీన్ చావుకు కల్వకుంట్ల కుటుంబమే బాధ్యత వహించాలన్నారు.
రాష్ట్రంలో 55 లక్షల మంది యువత తీవ్ర నైరాశ్యంలో ఉన్నారని అన్నారు. తొమ్మిది సంవత్సరాల పాలనలో ఏనాడైనా వారి బాగోగులు పట్టించుకున్నారా అని నిలదీశారు వైఎస్ షర్మిల. మీ అధికార దాహం కోసం ఇంకెంత మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవాలని ప్రశ్నించారు. తనకు ఏం సంబంధం ఉందని నిన్న మీడియాతో కేటీఆర్ మాట్లాడారని నిలదీశారు. పక్కన విద్యా శాఖ మంత్రి ఉన్నా ఎందుకు మాట్లాడ లేదని మండిపడ్డారు వైఎస్ షర్మిల(YS Sharmila).
అసెంబ్లీ సాక్షిగా 85 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని, కానీ ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. 2 లక్షల జాబ్స్ ఎక్కడ ఇచ్చారో చెప్పాలని నిలదీశారు.
Also Read : పేపర్ లీకు వెనుక కేటీఆర్ పీఏ హస్తం