YS Sharmila : కాంగ్రెస్ పార్టీని క్ష‌మించాలి – ష‌ర్మిల‌

వైఎస్సార్ అభిమానుల‌కు విజ్ఞప్తి

YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం దివంగ‌త , మాజీ సీఎం డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి శ‌నివారం 14వ వ‌ర్ధంతి. ఈ సంద‌ర్భంగా ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో పాటు ఆయ‌న త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి, భార్య భార‌తీ రెడ్డితో పాటు సోద‌రి వైఎస్ ష‌ర్మిల‌, బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ ఇడుపుల పాయ‌కు చేరుకున్నారు.

YS Sharmila Falimy to Dr.YSR

వైఎస్సార్ స‌మాధి వ‌ద్ద కొద్ది సేపు ప్రార్థ‌న‌లు చేశారు. ఘ‌నంగా నివాళులు అర్పించారు. అనంత‌రం వైఎస్ ష‌ర్మిల(YS Sharmila) మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్సార్ అభిమానులంతా కాంగ్రెస్ పార్టీని క్ష‌మించాల‌ని పిలుపునిచ్చారు.

వైఎస్సార్ పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చింది సోనియా గాంధీ అయితే ఆమెతో క‌లిసి ఎలా ప‌ని చేస్తారంటూ త‌న‌ను ప్ర‌శ్నిస్తున్నార‌ని చెప్పారు. అది కాంగ్రెస్ పార్టీ వాళ్లు తెలియక చేసిన పొర‌పాటు అని కావాలని చేసింది కాద‌ని అన్నారు.

వైఎస్సార్ అంటే ఇప్ప‌టికీ కాంగ్రెస్ పార్టీకి ఎన‌లేని గౌర‌వం ఉంద‌న్నారు వైఎస్ ష‌ర్మిల‌. వైఎస్సార్ ఈ ప్ర‌పంచాన్ని వీడి 14 ఏళ్ల‌వుతోంది. బైబిల్ ప్ర‌కారం రెండు కాలాలు దాటి పోయింది. అవ‌త‌లి వారిలో రియ‌లైజేష‌న్ వ‌చ్చిన‌ప్పుడు మ‌న‌లో క్ష‌మించే మ‌న‌సు రావాల‌న్నారు.

Also Read : PM Modi : ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ కు అభినంద‌న

Leave A Reply

Your Email Id will not be published!