YS Sharmila : సోనియా అంటే గౌర‌వం

వైఎస్సార్ టీపీ చీఫ్ ష‌ర్మిల‌

YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల కీల‌క కామెంట్స్ చేశారు. ఈ భూగోళంలో రాజ‌శేఖ‌ర్ రెడ్డి ని అంద‌రికంటే ఎక్కువ‌గా ప్రేమించిన వ్య‌క్తిని తాన‌ని పేర్కొన్నారు. ఆయ‌న‌కు గౌర‌వం లేని చోట తాను నిల‌బ‌డ లేన‌ని స్ప‌ష్టం చేశారు ష‌ర్మిల‌.

YS Sharmila Meet Sonia Gandhi

నా తండ్రి అన్నా , మా కుటుంబం ప‌ట్ల అపార‌మైన గౌరవం, అభిమానం ఉంద‌ని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. త‌మ తండ్రిగారిపై కేసు న‌మోదు చేయ‌డం తెలియ‌క చేసింది త‌ప్ప కావాల‌ని చేసింది కాద‌న్నారు. ఇడుపుల పాయ‌లో వైఎస్ ష‌ర్మిల(YS Sharmila) మీడియాతో మాట్లాడారు.

ఆమె రెండుసార్లు ఢిల్లీకి వెళ్లారు. తాను స్థాపించిన పార్టీని విలీనం చేస్తారా లేదా అన్న‌ది ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు. తెలంగాణ‌లో త్వ‌ర‌లో శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో వైఎస్ ష‌ర్మిల త‌న తండ్రి చేరిన పార్టీలోనే తిరిగి విలీనం చేసేందుకు డిసైడ్ అయ్యింది. వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ, సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీని విలీనం చేయాలా అనే దానిపై ఇంకా పార్టీ హైక‌మాండ్ నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది. మొత్తంగా ఎన్నిక‌లు ప్రారంభం అయ్యేంత వ‌ర‌కు విలీనం చేసే ఛాన్స్ ఎక్కువ‌గా ఉన్నాయ‌ని పార్టీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read : Director Nelson Comment : డైరెక్ట‌ర్ కింగ్ మేక‌ర్

Leave A Reply

Your Email Id will not be published!