YS Sharmila : దొర పాలనలో రైతన్నలు ఆగమాగం
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఓ వైపు భారీ వర్షాల ధాటికి పంటలు కోల్పోయి రైతులు ఆందోళన చెందుతుంటే ఆదుకోవాల్సిన కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యాడంటూ ఆరోపించారు. శనివారం జనగామ జిల్లా బుచ్చన్నపేట మండలంలో అకాల వర్షం కారణంగా పంటలను కోల్పోయిన రైతులను వైఎస్ షర్మిల(YS Sharmila) పరామర్శించారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రైతు కాళ్లకు ముళ్లు దిగితే తన పంటితో తీస్తానని గతంలో కేసీఆర్ చెప్పాడని, కానీ ఇప్పుడు రైతులు పంటలు కోల్పోయి లబోదిబోమంటే ఎక్కడున్నాడని ప్రశ్నించారు. మాయ మాటలు, సొల్లు కబుర్లు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్న ఘనత ఈ సీఎంకే దక్కిందన్నారు. ఇప్పటి వరకు పంట నష్ట పరిహారం అంద లేదని, రైతు బీమా అమలు కాలేదని అసలు సీఎం ఉన్నాడా అన్న అనుమానం కలుగుతోందన్నారు వైఎస్ షర్మిల(YS Sharmila).
ఇది భరోసా ఇచ్చే సర్కార్ కాదన్నారు. కేవలం కిసాన్ బర్బాద్ సర్కార్ గా అభివర్ణించారు. ఇకనైనా ఈ లోకంలోకి రావాలని, మత్తు వీడితే రైతులకు మేలు జరుగుతుందని ఎద్దేవా చేశారు షర్మిల. అకాల వర్షం కారణంగా పంటలు కోల్పోయిన వారికి తక్షణమే రూ. 10 వేలు ఇస్తానని చెప్పాడని ఇప్పుడు పత్తా లేకుండా పోయాడంటూ సంచలన ఆరోపణలు చేశారు .
Also Read : నవీన్ మిట్టల్ పై వీసీ గుస్సా