YS Sharmila BRS Party : పార్టీ కాదు బందిపోట్ల రాష్ట్ర సమితి
వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్
YS Sharmila BRS Party : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మరోసారి సీఎం కేసీఆర్ ను, ఆయన స్థాపించిన భారత రాష్ట్ర సమితి పార్టీపై నిప్పులు చెరిగారు. ప్రజా ప్రస్థానం పేరుతో ఆమె చేపట్టిన యాత్ర లో భాగంగా తొర్రూరులో జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బీఆర్ఎస్ పార్టీ కాదని అది బందిపోట్ల రాష్ట్ర సమితి అంటూ ఆరోపించారు వైఎస్ షర్మిల(YS Sharmila BRS Party).
తెలంగాణ పేరుతో రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ పేరు జపించేందుకు , ఎత్తేందుకు కూడా ఇష్ట పడడం లేదని మండిపడ్డారు. అమలుకు నోచుకోని హామీలతో ప్రజలను మోసం చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు.
కల్వకుంట్ల కుటుంబం దోచు కోవడానికే తెలంగాణలో పాలన సాగిస్తోందని ఆరోపించారు. పొద్దస్తమానం హామీలు గుప్పించడం ఫామ్ హౌస్ లో పడుకోవడం తప్పితే ప్రజల గురించి ఆలోచించిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలే నేటికీ అమలవుతున్నాయని కొత్తవి ప్రకటించినవి ఏవి అంటూ ప్రశ్నించారు. విద్య, వైద్యం, ఉపాధి అటకెక్కిందని ధ్వజమెత్తారు.
తాము పవర్ లోకి వస్తే ఉచితంగా విద్య, వైద్యం అందజేస్తామని, రైతులను ఆదుకుంటామని అన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారంటూ ఆరోపించారు. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్ , బీజేపీ ఉన్నా ఉలుకూ పలుకు లేదని ఎద్దేవా చేశారు. తమ పార్టీ ఒక్కటే ప్రజల తరపున పోరాడుతోందన్నారు వైఎస్ షర్మిల.
Also Read : కల్వకుంట్ల అవినీతిని కక్కిస్తాం – బండి