YS Sharmila : నోట్లు..ఓట్లు త‌ప్ప కేసీఆర్ కు ఏవీ ప‌ట్ట‌వు

వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న కామెంట్స్

YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె వ‌రుస‌గా సీఎం కేసీఆర్ ను, ఆయ‌న ఫ్యామిలీని, టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ష‌ర్మిల చేప‌ట్టిన ప్ర‌జా ప్ర‌స్థానం పాద‌యాత్ర హ‌న్మ‌కొండ జిల్లాలో కొన‌సాగుతోంది.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. కాళేశ్వ‌రం కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎం మెషీన్ లాగా మారింద‌ని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని నిల‌దీశారు. తాము ఒక్క‌ర‌మే స‌ర్కార్ ను ప్ర‌శ్నిస్తున్నామ‌ని చెప్పారు ష‌ర్మిల‌(YS Sharmila).

మ‌రో ప‌ది నెల‌ల్లో ఎన్నిక‌ల‌కు రెడీ అవుతున్నాడ‌ని ఇప్పుడు జ‌నం దొర‌కు గుర్తుకు వ‌చ్చారంటూ ధ్వ‌జ‌మెత్తారు. దొర‌కు ఓట్లు , నోట్లు త‌ప్ప ఇంకేమీ ప‌ట్ట‌వంటూ మండిప‌డ్డారు. తెలంగాణ‌లో ప్ర‌స్తుతం రాచ‌రిక పాల‌న సాగుతోంద‌న్నారు. ప్ర‌జాస్వామ్యం అన్న‌ది లేకుండా పోయింద‌న్నారు.

కాళేశ్వ‌రంలో అవినీతి చోటు చేసుకుంద‌ని ప్ర‌క‌టించిన నిర్మ‌లా సీతారామ‌న్ ఇప్పుడు ఎందుకు మాట్లాడ‌టం లేద‌ని నిల‌దీశారు. తాను అన్ని ఆధారాల‌ను ఢిల్లీ లో ఇచ్చి వ‌చ్చాన‌ని చెప్పారు. సంక్షేమ ప‌థ‌కాల పేరుతో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తూ పాల‌న‌ను గాలికి వ‌దిలి వేశారంటూ సీఎంపై ఫైర్ అయ్యారు వైఎస్ ష‌ర్మిల‌.

ఇది దొర‌ల రాజ్య‌మ‌ని , దొంగ‌ల ప్రభుత్వ‌మ‌ని సీరియ‌స్ కామెంట్స్ చేశారు. పోలీసులు జీత‌గాళ్లుగా మారి పోయారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. బంగారు తెలంగాణ పేరుతో బ‌తుకుల్ని బుగ్గిపాలు చేశారంటూ నిప్పులు చెరిగారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ఫ్యామిలీకి ప్ర‌జ‌లు చుక్క‌లు చూపించ‌డం ఖాయ‌మ‌న్నారు.

Also Read : భ‌య‌పడి బెయిల్ ఇవ్వడం లేదు – సీజేఐ

Leave A Reply

Your Email Id will not be published!