YS Sharmila : స్కీంల పేరుతో కేసీఆర్ మోసం
వైస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల
YS Sharmila : తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి నిప్పులు చెరిగారు వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల. ప్రజలకు మంచి చేస్తానని నమ్మించి మోసం చేసిన ఘనత కేసీఆర్ కు దక్కిందన్నారు. మోసం చేయడంలో కేసీఆర్ ప్రపంచంలోనే నెంబర్ 1 అంటూ సంచలన ఆరోపణలు చేశారు. జనాలను గొర్రెలు చేసి పథకాల పేరుతో బురిడీ కొట్టించిన ఘనడు కేసీఆర్ అంటూ మండిపడ్డారు వైఎస్ షర్మిల(YS Sharmila).
త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు రెడీ అయ్యాడంటూ ఎద్దేవా చేశారు.
స్కీంల పేరుతో ఓట్లకు గాలం వేయడం, ఆ తర్వాత దొర ఫామ్ హౌస్ కు పరిమితం కావడం పరిపాటిగా మారిందంటూ మండిపడ్డారు. ఈ 10 ఏళ్ల పాలనలో 10 పథకాలు కూడా అమలు చేయలేదని కానీ దేశానికి దార్శనికుడంటూ పెద్ద ఎత్తున ప్రజా ధనంతో ప్రచారం చేసుకున్నాడని ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిల.
రుణ మాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత మాట మార్చాడని, రైతులను నట్టేట ముంచాడని మండిపడ్డారు. 5 వేల రూపాయల రైతు బంధు చూపించి 35 వేల సబ్సిడీని ఆపిన ఘనుడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. ఆత్మ గౌరవం పేరుతో ఇళ్లు ఇస్తానని చెప్పి కొంతమందికే ఇచ్చాడంటూ ఫైర్ అయ్యారు.
Also Read : TATA I Phone : ఐ ఫోన్ల తయారీదారుగా టాటా