YS Sharmila : బీఆర్ఎస్ కాదు బందిపోట్ల సమితి – షర్మిల
వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ కామెంట్స్
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వాన్ని ఏకి పారేస్తున్నారు. ఆమె చేపట్టిన పాదయాత్ర 3,000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇదే సమయంలో ఆమె యాత్రకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్(CM KCR) పై నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేంద్ర మంత్రులు చెబుతున్నా ఎందుకని సీఎంను, ఆయన ఫ్యామిలీని అరెస్ట్ చేయడం లేదంటూ ప్రశ్నించారు వైఎస్ షర్మిల. భారత దేశ రాష్ట్ర సమితి కాదని బందిపోట్ల సమితి అంటూ ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి కోసం కడుతున్నారంటూ ప్రశ్నించారు. రీ డిజైన్ చేసుకుంటూ అంచనాలు పెంచుతూ కమీషన్లు దండుకుంటూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఆరోపించారు వైఎస్ షర్మిల(YS Sharmila). పొలాలకు నీళ్లు ఇస్తానన్న ఈ పెద్ద మనిషి కాళేశ్వరం నీళ్లను కేసీఆర్ తన ఫామ్ హౌస్ కు తీసుకు పోతున్నాడని ఆరోపించారు.
రైతుల పొలాలకు నీరందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులకు ఇండ్ల స్థలాలు ఇస్తానని , రూ. 10 లక్షల వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చాడని ఇప్పటి వరకు దానిని అమలు చేయలేదని ధ్వజమెత్తారు. సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటాలు, ఇండ్ల పట్టాలు ఇచ్చిన ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిది అని పేర్కొన్నారు.
షర్మిల చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
Also Read : మోదీజీ కేసీఆర్ అరెస్ట్ ఎప్పుడో చెప్పండి – షర్మిల