YS Sharmila KCR : ప్రజల సొమ్ముతో ప్రచారమా – షర్మిల
సీఎం కేసీఆర్ మరాఠా టూర్ పై ఫైర్
YS Sharmila KCR : రెండు రోజుల పర్యటన నిమిత్తం భారీ కాన్వాయ్ తో సీఎం కేసీఆర్ సోమవారం మరాఠాకు బయలు దేరి వెళ్లారు. అక్కడ ఇవాళ షోలాపూర్ లో బస చేస్తారు. అక్కడి నుంచి నేరుగా పండరీపురం వెళతారు. మంగళవారం ప్రముఖ దేవాలయం తుల్జా భవానిని సందర్శిస్తారు. ఇదే సమయంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ , ఎన్సీపీ నుంచి నాయకులు బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇందు కోసం ఏకంగా 600 వాహనాలతో రోడ్డు మార్గం ద్వారా వెళ్లారు సీఎం కేసీఆర్.
దీనిపై నిప్పులు చెరిగారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila). సోమవారం ట్విట్టర్ వేదికగా నిలదీశారు. అసలు ప్రజల సొమ్ముతో ఎలా ప్రచారం చేసుకుంటారంటూ ప్రశ్నించారు. సోయి లేకుండా పాలన సాగిస్తున్న కేసీఆర్ కు తగిన రీతిలో బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ప్రజల రక్తాన్ని, మాంసాన్ని పీక్కు తింటున్న ఘనత బీఆర్ఎస్ నేతలకే దక్కుతుందని సంచలన ఆరోపణలు చేశారు షర్మిల.
పార్టీ ప్రచారానికి ప్రజల సొమ్మును ఎలా వాడతారంటూ నిలదీశారు. మిమ్మల్ని ఏదో ఒక రోజు గల్లా పట్టుకుని ప్రశ్నించే రోజులు త్వరలోనే వస్తాయని మండిపడ్డారు. బస్సులు తెలంగాణకు చెందిన ఆస్తులని వాటిని ఇలాంటి పనికిమాలిన పనుల కోసం , ప్రచారం కోసం వాడుకుంటారా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల.
Also Read : Bandi Sanjay : బండికి హైకమాండ్ పిలుపు