YS Sharmila : ఏపీలో ఆ మూడు పార్టీల్లో ఏ పార్టీకి ఓటు వేసిన బీజేపీకి ఓటు వేసినట్టే…
ప్రత్యేక హోదా కోసం సింహంలా పోరాడాలని షర్మిల అన్నారు
YS Sharmila : జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు ఎవరు ఓటు వేసిన బీజేపీకి వేసినట్లేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. బీజేపీ, అధికార, ప్రతిపక్ష పార్టీలు చేసిన మోసాన్ని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బయటపెట్టాలని సూచించారు. గురువారం అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని, ప్రత్యేక హోదా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని, గొర్రెల్లా ఉండొద్దని సింహాల్లా బయటకు రావాలని సూచించారు. సీఎం జగన్ చంద్రబాబులను నమ్ముకొని గొర్రెల్లా ఉన్నామని ఇపుడైనా సింహంలా గర్జించాలని వ్యాఖ్యానించారు.
YS Sharmila Slams..
ప్రత్యేక హోదా కోసం సింహంలా పోరాడాలని షర్మిల(YS Sharmila) అన్నారు. అవసరమైతే లాక్కోవాలని అన్నారు. ఏపీకి నరేంద్ర మోదీ ఏం చేశారని పవన్ కల్యాణ్…ప్రధాని మోదీ అంటే గౌరవం అంటున్నారు కానీ మోదీ రుడిఫాల్టర్ కాదా? ఇచ్చిన హామీలు వేరవేర్చారా ? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం. విభజన హామీని నెరవేర్చలేదన్నారు. తన తండ్రి వైఎస్ హయాంలో 54 ప్రాజెక్టులను ప్రారంభించామన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న శ్రీ జగన్ ప్రాజెక్టును నీరుగార్చారని విమర్శించారు. జగన్ తన హామీని తుంగలో తొక్కారు. అయన వైఎస్ వారసుడా?అని వ్యాఖ్యానించారు.
ఏపీలో ప్రత్యేక హోదా కోసం పోరాడే వారెవరూ లేరని, అందుకే తాను ఏపీ ప్రజల కోసం వచ్చానని షర్మిల అన్నారు. రాష్ట్రంలో యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, లేక ఉపాధి కోల్పోతున్నారని, ప్రత్యేక హోదా రాకుంటే తమకు భవిష్యత్తు లేదని ఏపీపై ఆవేదన వ్యక్తం చేశారు. . భారతీయ జనతా పార్టీ, అధికార, ప్రతిపక్షాలు చేస్తున్న మోసాన్ని చూస్తుంటే బాధగా ఉందన్నారు. పార్లమెంటరీ పార్టీగా ప్రత్యేక హోదాపై ప్రకటన చేశానన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతోనే సాధ్యమని వైఎస్ షర్మిల సూచించారు.
Also Read : Telangana High Court : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు