YS Sharmila : బీఆర్ఎస్ లో మహిళలకు రిజర్వేషన్లు ఏవీ
ఎమ్మెల్సీ కవిత లేఖకు రిప్లై
YS Sharmila : హైదరాబాద్ – వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. చట్ట సభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లకు సంబంధించి తాను చేస్తున్న పోరాటానికి బేషరతు మద్దతు ఇవ్వాలని కోరారు తెలంగాణ సీఎం కేసీఆర్ తనయురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ మేరకు వైఎస్ షర్మిలకు లేఖ రాశారు. ఈ విషయాన్ని షర్మిల ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
YS Sharmila Comments Viral
భారత పార్లమెంట్ , రాష్ట్రాల శాసనసభలలో మహిళలకు రిజర్వేషన్లు కావాలని పోరాట బాట పట్టారు కవిత. తాను చేపట్టిన కార్యక్రమాలకు సపోర్ట్ కావాలని కోరిందని పేర్కొన్నారు. ఈ విషయంపై వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్రంగా స్పందించారు. తెలంగాణ సీఎంగా ఉన్న తన తండ్రి కేసీఆర్ ఎంత మందికి 33 శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించారో చెప్పాలంటూ నిలదీశారు.
కేవలం 5 శాతం లోపు మహిళలకే ఛాన్స్ ఇచ్చారంటూ పేర్కొన్నారు. 2014 లో 6 మంది మహిళలకు, 2018లో నలుగురికే అవకాశం ఇవ్వడం మరిచి పోయారా అంటూ ప్రశ్నించారు వైఎస్ షర్మిల. దేశం గురించి ప్రశ్నించే ఎమ్మెల్సీ కవిత ముందు తన తండ్రి స్థాపించిన పార్టీని, కేసీఆర్ ను నిలదీయాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల.
తాజాగా ప్రకటించిన అసెంబ్లీ నియోజకవర్గాల లిస్టులో ఎంత మంది మహిళలకు ఛాన్స్ ఇచ్చారో ఒకసారి తిరిగి చూసుకోవాలని సూచించారు.
Also Read : Sanju Samson : బీసీసీఐ నిర్వాకం సంజూకు అన్యాయం