YS Sharmila : ఖాకీల తీరుపై షర్మిల కన్నెర్ర
గిరిజన మహిళకు పరామర్శ
YS Sharmila : రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు వైస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల. ఎల్బీనగర్ లో పోలీసులు అకారణంగా గిరిజన మహిళను స్టేషన్ కు తీసుకు వెళ్లి చిత్రహింసలకు గురి చేశారు. దీంతో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. బాధిత గిరిజన మహిళను వైఎస్ షర్మిల పరామర్శించారు.
YS Sharmila Slams Police
ఒక గిరిజన మహిళకు ఇంత అన్యాయం జరుగుతుంటే గిరిజన శాఖ మంత్రి ఎక్కడున్నారని ప్రశ్నించారు. నిద్ర పోతోందా అని నిప్పులు చెరిగారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ గొప్పగా చెప్పుకునే పోలీసు శాఖ , డీజీపీ, హోం మంత్రి ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. చోద్యం చూస్తూ కూర్చున్నారా అంటూ ప్రశ్నించారు వైఎస్ షర్మిల(YS Sharmila).
ఇంత దారుణానికి ఒడిగడితే ఇక మహిళలకు రక్షణ ఎక్కడ దొరుకుతుందన్నారు. రౌడీల్లా, రేపిస్టుల్లా పోలీసులు ప్రవర్తించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అరాచకానికి పాల్పడిన ఎస్ఐ రవి కుమార్ , కానిస్టేబుల్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ నిలదీశారు. బాధిత మహిళపై దాడి చేసిన వారిని కాకుండా ఎవరో ఇద్దరు కానిస్టేబుళ్లను ఎందుకు సస్పెండ్ చేశారంటూ ఫైర్ అయ్యారు .
అసలు ఒక మహిళను ఇంత దారుణంగా కొట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటూ నిప్పులు చెరిగారు. ఆమెకు న్యాయం చేయాలని కోరుతూ ధర్నాకు దిగితే మాపై దౌర్జన్యం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. మా అరెస్ట్ ను ఖండిస్తున్నామని అన్నారు.
Also Read : Nara Lokesh : అధికారంలోకి వస్తే జీవోలు రద్దు – లోకేష్