YSR Pension Kanuka: ఏపీలో సామాజిక పింఛన్ల సొమ్ము విడుదల ! ఈ సారి కూడా బ్యాంకు ఖాతాల్లోనే !
ఏపీలో సామాజిక పింఛన్ల సొమ్ము విడుదల ! ఈ సారి కూడా బ్యాంకు ఖాతాల్లోనే !
YSR Pension: జూన్ నెలకు సంబంధించి సామాజిక భద్రతా పింఛన్ల సొమ్మును విడుదల చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 65,30,808 మంది పెన్షనర్లకు రూ.1,939.35 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వెల్లడించారు. జూన్ 1న నగదు బదిలీ ద్వారా 47,74,733 మంది బ్యాంకు ఖాతాలకు పింఛను సొమ్ము జమ చేయనున్నట్లు తెలిపారు. వికలాంగులు, 85 సంవత్సరాలు దాటిన వయో వృద్ధులకు జూన్ ఒకటి నుంచి 5 వరకు ఇంటింటికీ వెళ్లి సచివాలయం సిబ్బంది 17,56,105 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తారని తెలిపారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ పింఛన్లు పంపిణీ చేయాలని ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
YSR Pension Kanuka Funds..
ఏపీ రాజకీయాలు పెన్షన్ల(YSR Pension) పంపిణీ చుట్టూ తిరుగుతున్నాయి. ఎన్నిలక నోటిఫికేషన్ విడుదలై… ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోనికి రావడంతో… ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలను గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయకూడదని ఎన్నికల కమీషన్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో వికలాంగులకు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేసినప్పటికీ… మిగిలిన వారిని సచివాలయం వద్దకు రావాలని సూచించడంతో… రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వయో వృద్ధులు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ తన అనుకూలమైన వ్యక్తులతో కోర్టులో కేసులు వేసి, ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేయడంతోనే పెన్షన్ల పంపిణీకు వాలంటీర్లను దూరం చేసారంటూ వైసీపీ నాయకులు ఆరోపణ చేసారు. ఈ నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు మే నెల పెన్షన్లను ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడూ అదే విధానాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read : Pinnelli Paisachikam: ‘పిన్నెల్లి పైశాచికం’ పేరుతో పుస్తకం విడుదల చేసిన టీడీపీ నేతలు !