YSRCP 5th List: వైసీపీ ఐదో జాబితా విడుదల !
వైసీపీ ఐదో జాబితా విడుదల !
YSRCP: వైనాట్ 175 లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని అధికార వైసీపీ(YSRCP) అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు సమన్వయకర్తల మార్పులు చేర్పులు చేస్తుంది. దీనితో భాగంగా ఐదో జాబితాను ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రకటించారు. ఈ ఐదో విడత జాబితాలో… నాలుగు ఎంపీ స్థానాలకు, మూడు ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిల ప్రకటించారు.
ఐదో జాబితా విడుదల చేసే క్రమంలో… పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి (రాజ్యసభ సభ్యులు) కి అదనంగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలను అప్పజెప్పింది పార్టీ అధిష్టానం. అలాగే ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ రీజినల్ కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పింది. అంతేకాదు కందుకూరు, సంతనూతలపాడు, కావలి అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా రీజినల్ కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని వ్యవహరిస్తారని పార్టీ అధిష్టానం ప్రకటించింది.
YSRCP – ఐదో జాబితాలో పేర్లు
కాకినాడ ఎంపీ- చలమశెట్టి సునీల్,
మచిలీపట్నం ఎంపీ- సింహాద్రి రమేశ్ బాబు,
నరసరావుపేట ఎంపీ-అనిల్ కుమార్ యాదవ్,
తిరుపతి ఎంపీ-గురుమూర్తి,
సత్య వేడు ఎమ్మెల్యే –నూకతోటి రాజేష్,
అరకు వ్యాలీ(ఎమ్మెల్యే)-రేగం మత్స్యలింగం,
అవనిగడ్డ ఎమ్మెల్యే- సింహాద్రి చంద్రశేఖరరావు
ఇదిలా ఉంటే.. తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు(3 ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు (6 ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగో జాబితాలో 8 స్థానాలకు (1 ఎంపీ, 8 అసెంబ్లీ) సమన్వయకర్తలను నియమిస్తూ వైసీపీ అధిష్టానం జాబితాలు విడుదల చేసింది.
Also Read : AP Cabinet : నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్