YSRCP Bus Yatra : ఆంధ్రప్రదేశ్ – అధికారంలో ఉన్న వైసీపీ(YSRCP) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్దం అవుతున్నారు. ఓ వైపు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూనే మరో వైపు సంక్షేమ పథకాల అమలుపై ఫోకస్ పెట్టారు.
YSRCP Bus Yatra Will be Start
ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఉండాలని ఆదేశించారు. అంతే కాకుండా గడప గడప కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పుడు ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, శ్రేణులు బిజీగా మారారు. జగన్ రెడ్డి తీసుకు వచ్చిన వాలంటీర్ వ్యవస్థ పార్టీకి, ప్రభుత్వానికి బలంగా మారింది.
తాజాగా సరికొంత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఏపీ సీఎం. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని నిర్ణయించారు. దీనికి సామాజిక సాధికార యాత్ర బస్సు యాత్ర చేపట్టారు. ఈ యాత్ర అక్టోబర్ 26 గురువారం నుండి ప్రారంభం కానుంది.
ఇందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఫుల్ బిజీగా మారారు. ఈ బస్సు యాత్రలు కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో మొదలవుతాయి. ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో చేపట్టిన పథకాలు, కార్యక్రమాల గురించి ప్రచారం చేస్తారు.
Also Read : Congress 2nd List : రెండో జాబితాపై కాంగ్రెస్ ఫోకస్