MP Avinash Reddy : అరెస్ట్ చేయకుండా ఆదేశించండి – ఎంపీ
ఆదేశాలు ఇవ్వాలని కోరిన అవినాష్ రెడ్డి
MP Avinash Reddy : వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వివేకానంద రెడ్డి హత్య కేసులో. అవినాష్ రెడ్డి సీఎం జగన్ రెడ్డికి కావాల్సిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఈ తరుణంలో ఈ హత్య కేసులో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ సందర్భంగా సీబీఐ విచారణ చేపట్టింది. రంగంలోకి దిగింది. పదే పదే ఆయనను విచారిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) గురువారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం విస్తు పోయేలా చేసింది.
ఆయన స్వంతంగా పిటిషన్ దాఖలు చేయడం కలకలం రేపింది. వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు విచారణలో కొన్ని వారాలుగా సీబీఐ ఎంపీని ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. వివేకానంద రెడ్డి ఎవరో కాదు మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డికి స్వయాన తమ్ముడు.
ఏపీ సీఎం జగన్ రెడ్డికి స్వయాన చిన్నాన్న. ఏపీలో ఈ కేసు ఉంటే సాగదని తెలంగాణకు లేదా కేంద్రం పరిధిలోకి మార్చాలంటూ వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వాపోయింది. ఇది పక్కన పెడితే వైసీపీ ఎంపీ ఆరోపణలు ఎదుర్కోవడం ప్రస్తుతం చర్చకు దారి తీసేలా చేసింది.
ప్రస్తుతం కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విన్నవించారు. ముందస్తు చర్యలు తీసుకోకుండా చేయాలని కోరారు.
సీబీఐ పిలిచిన ప్రతిసారి తాను హాజరవుతున్నానని తెలిపారు. సీబీఐ విచారణ సందర్బంగా ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని తాను కోరుతున్నానని స్పష్టం చేశారు పిటిషన్ లో. లాయర్ సమక్షంలో ఇది జరిగేలా ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి.
Also Read : అవాస్తవాలు అన్నీ అబద్దాలు – కిషన్ రెడ్డి